8 ప్రాణాలు బలితీసుకున్న ప్రమాదం.. సంతాపం తెలిపిన సీఎం
x

8 ప్రాణాలు బలితీసుకున్న ప్రమాదం.. సంతాపం తెలిపిన సీఎం

రోడ్డు ప్రమాదాలు అంటే ప్రతి రోజూ జరిగే అంశంలా మారింది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.


రోడ్డు ప్రమాదాలు అంటే ప్రతి రోజూ జరిగే అంశంలా మారింది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిద్రమత్తో, మద్యం మత్తూ, వేగం ఇచ్చే కిక్కో తెలియదు కానీ ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపాళ్యం మండంమగలి కనుమ రహదారిలో ఈ ప్రమాదం జరిింది. ఒక బస్సు, రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న బస్సును ఎదురుగా ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టర్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తును శరవేగంగా ముందుకు సాగిస్తున్నామని చెప్పారు. లారీ డ్రైవర్‌దే తప్పని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని కూడా చెప్పారు.




ప్రమాదం జరిగిందిలా..

కనుమ రహదారిలో లారీ అతివేగంతో ప్రయాణిస్తుందని, అతి వేగం కారణంగానే ఒక్కసారిగా అదుపుతప్పి.. పక్క రోడ్డులో వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లిందని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ సహా ఎనిమిది మంది మరణంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ ఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా లారీ డ్రైవర్.. అతివేగానికి కారణం నిర్లక్ష్యమా, మద్యం మత్తా అనేది నిర్ధారించాలని కూడా ఆదేశించారు.

స్పందించిన సీఎం..

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మరో ప్రాణం పోకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు చంద్రబాబు. అనంతరం క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Read More
Next Story