86 గ్రామాలను ముంచెత్తిన ఏలేరు వరద.. భారీగా పంట నష్టం..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాలు ఏపీ సర్కార్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. విజయవాడ వరదల తగ్గాయి అని ప్రభుత్వం ఊపిరిపీల్చుకునేలోపే కాకినాడలో 86 గ్రామాలకు వరదనీరు ముంచెత్తింది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాలు ఏపీ సర్కార్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. విజయవాడ వరదల తగ్గాయి అని ప్రభుత్వం ఊపిరిపీల్చుకునేలోపే కాకినాడలో 86 గ్రామాలకు వరదనీరు ముంచెత్తింది. ఏలేరు కాలువ పొంగడంతో అక్కడి పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఏలేరు రిజర్వాయర్‌కు గండి పడటంతోనే ఈ వరద వచ్చిందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల్లో పడుతున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఏలేరుకు భారీగా మొత్తంలో వరద నీరు వచ్చి చేరిందని, రిజర్వాయర్ నుంచి సుమారు 27వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. విజయవాడలో ఎనిమిది రోజులుగా సహాయక చర్యలు అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగడంతో ఇటు పరుగులు పెడుతోంది. వెంటనే కాకినాడలో సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరినీ పునరావాస కేంద్రాలకు తరలించేలా ఆఘమేఘాలపైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించాలని ఆదేశించింది. ఆ దిశగా చర్యలను యుద్ధప్రాతిపదిక చేపడుతున్నామని అధికారులు కూడా ప్రకటించారు.
వరదల పాలైన వేల ఎకరాల పంట
ఏలూరు రిజర్వాయర్‌కు దాదాపు 47వేల క్యూసెక్కుల వరద నీరు చేరిందని, ఇంత మొత్తంలో వరద నీరు గతంలో ఏన్నడూ రాలేదని అధికారులు చెప్పారు. ఈ వరల కారణంగా 10 మండల్లాల్లోని 86 గ్రామాలకు పూర్తి జలమయం అయ్యాయిన, దీంతో గ్రామాల నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాలు వరదల పాలయ్యాయని, ఏలేరు రిజర్వాయర్‌కు గండి పడటం వల్లే ఈ గ్రామాలకు వరద ముంచెత్తిందని అధికాలు చెప్పారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని, వారిని వీలైనంత త్వరగా పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు వివరించారు.
ఎమ్మెల్యే పర్యటన..
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ట్రాక్టర్‌పై పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అదే విధంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనతరం వరద ఉధృతి గురించి అధికారులతో చర్చించారు. రాజుపాలెంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వరద ప్రవహిస్తోందని, ఈ వరద వల్ల పత్తిపాడు-సామర్లకోట మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని తరలించామని, మరింత మందిని తరలించడానికి యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా సహాయక చర్యలు అందించడానికి ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రానున్నాయని ఎమ్మెల్యే చెప్పారు.