ఆంధ్రప్రదేశ్ లో 9 గ్యారెంటీలు

ఆంధ్రప్రదేశ్ లో తొమ్మది గ్యారెంటీలు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో ఓటర్లలో హర్షం. కాంగ్రెస్ ను గెలిపిస్తే తప్పకుండా అమలు.


ఆంధ్రప్రదేశ్ లో 9 గ్యారెంటీలు
x
YS Sharmila, APCC

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు ప్రకటించింది. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని వైఎస్ షర్మిలరెడ్డి శనివారం విజయవాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తొమ్మిది గ్యారెంటీలను వివరించారు.

మొదటి గ్యారెంటీ: రాష్టానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అధికారంలో వచ్చిన వెంటనే హోదా అమలు.

రెండో గ్యారెంటీ: మహిళా మహాలక్ష్మి: ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8,500 ఇస్తాం, ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తాం, ఇది మహిళకు బరోసా ఇచ్చే పథకం

మూడో గ్యారెంటీ: రైతులకు రుణమాఫీ: రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ.

నాలుగవ గ్యారెంటీ: పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర.

5వ గ్యారెంటీ: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ. 400 రూపాయలు.

6వ గ్యారెంటీ: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.

7వ గ్యారెంటీ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే.

8వ గ్యారెంటీ: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ. 5 లక్షలతో పక్కా ఇల్లు.

9వ గ్యారెంటీ: ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్.


Next Story