ఏపీలో కొత్తగా 982 ఎన్నికల పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం రాత్రి కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఏపీలో కొత్తగా 982 ఎన్నికల పోస్టులు
x
ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలక్టర్లతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్‌ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

పటిష్ట నిఘాకై 105 అంతర్‌ రాష్ట్ర చెక్కు పోస్టులు

చెక్‌ పోస్టుల ద్వారా రూ. 2.35 కోట్లు నగదు, 51వేల 143 లీటర్ల మద్యం స్వాధీనం
ఎన్నికలతో సంబంధం ఉన్నఅధికారుల బదిలీ దాదాపు పూర్తి
పోలింగ్‌ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్, దివ్యాంగులకు ర్యాంపుల సౌకర్యాల ఏర్పాటుకు ఆదేశాలు
రానున్న సాధారణ ఎన్నికల పటిష్ట నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్‌), అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆపోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా చీఫ్‌ సెక్రటరీ కలెక్టర్‌లతో మాట్లాడారు. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇప్పటికే పిఆర్‌ అండ్‌ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్ఫోర్సు మెంట్‌ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయింది. పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంత మేరకు బదిలీలు జరిగాయి. మిగాతా బదిలీలు ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయి. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు రెండు రోజుల్లో అమలు చేయాలి.
రానున్న ఎన్నికల్లో పటిష్ట నిఘాకై 105 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు, పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్‌ ఎన్ఫోర్సుమెంట్‌ బ్యూరో ద్వారా 9, అటవీశాఖ ద్వారా 14 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీఎస్‌ వెల్లడించారు. గత నెల రోజుల్లో అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులు ద్వారా రూ. 2.35 కోట్ల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1,323 కిలోల వివిధ మాదక ద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ వివరించడం విశేషం. ఈచెక్‌ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్ధవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోనున్నాయి.
పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, పర్నిచర్, విద్యుత్‌ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడారు. రానున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్‌ ఏర్పాట్లకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
Next Story