చికెన్ షాపుల మూసివేతకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ హరినారాయణ్ ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పని చేయాలని, వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు కలెక్టర్ అధికారులకు సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో కోళ్లు చనిపోయాయని తెలిపిన కలెక్టర్ తెలిపారు.
ఈ రెండు ప్రాంతాల్లో కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోతున్నాయని ఇప్పటికే ఫెడరల్ తెలియజేసింది.
కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో మూడు రోజులపాటు పాటు చికెన్ షాపులు పూర్తిగా మూసేవేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మూడు నెలల వరకు షాపులు బంద్
ఒక కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్లను వెంటనే భూమిలో పాతిపెట్టాలని, పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాపించిన గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో గ్రామసభలు నిర్వహించాలని, ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలని, ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని, అధికారులకు కలెక్టర్ సూచించారు. గతంలో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని, ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.