తరిగొండ స్వామికి కిరీటాన్ని అందించి దాతృత్వాన్ని చాటిన వీళ్లెవరంటే..
x

తరిగొండ స్వామికి కిరీటాన్ని అందించి దాతృత్వాన్ని చాటిన వీళ్లెవరంటే..

తిరుపతికి 110కిలోమీటర్ల దూరంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి చెన్నైకి చెందిన ఓ కుటుంబం డిసెంబర్ 22న బంగారు కిరీటాన్ని అందించింది.


తరిగొండ.. తిరుపతికి 110 కిలోమీటర్లు.. అక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం.. కాస్తంత అబ్బుర పరిచే విషయమే అయినా భక్తిపారవశ్యం, నమ్మిక ఉన్న భక్తులకు దూరాభారం పెద్ద లెక్కకాదు. శ్రీవెంకటేశ్వర స్వామికి, కనకదుర్గమ్మ అమ్మవారికి, అలివేలమ్మకు బంగారు కిరీటాలు, పసిడి తాపడాలు పెద్ద లెక్కకాదు. కానీ ఎక్కడో మారుమూలనున్న స్వామికి బంగారు కిరీటం మహాగొప్ప విషయమే. భక్తులకు దేవుడికి దూరం తక్కువ అని చాటారు చెన్నైకి చెందిన ఓ కుటుంబం.

తిరుపతికి 110కిలోమీటర్ల దూరంలోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలో తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఆ స్వామికి చెన్నైకి చెందిన ఓ కుటుంబం డిసెంబర్ 22న బంగారు కిరీటాన్ని అందించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంది. చెన్నైలో ఉంటున్న వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు మనోహర్ ఈ కిరీటాన్ని తయారు చేయించారు. దీని విలువ సుమారు రూ.27 లక్షలు. ఈ కిరీటానికి పట్టిన బంగారం 341 గ్రాములు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించడం పట్ల భక్తులు, ఆలయ నిర్వాహకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వసంత లక్ష్మి కుటుంబాన్ని అభినందించారు. ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ ముని బాల కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ డి కృష్ణమూర్తి, అసిస్టెంట్ నాగరాజు, ఆలయ అర్చకులు గోపాల భట్టార్, కృష్ణ ప్రసాద్ భట్టార్, గోకుల్, అనిల్ కుమార్ ఈ బంగారు కిరీటాన్ని స్వీకరించారు. దర్శనానంతరం దాతలకు పండితులు వేద ఆశీర్వచనం అందించినట్టు టీటీడీ తెలిపింది.

Read More
Next Story