రాజకీయాల్లో ఇంత వల్గర్ గా మాట్లాడతారా!

రాజకీయాల్లో వల్గర్ లాంగ్వేజీ మీద తెలుగుదేశం నేత చంద్రబాబు ఆవేదన


రాజకీయాల్లో ఇంత వల్గర్ గా మాట్లాడతారా!
x
పొలాల్లో వరద నీటిని పరిశీలిస్తున్న చంద్రబాబు

రాజకీయాల్లో వల్గర్ భాషా మాట్లాడటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తానెపుడు ఎవరి మీద వల్గర్ ప్రయోగించలేదని, అలాంటి ఎపుడూ చేయనని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రసంగిస్తూ చంద్రబాబు రాజకీయ భాష తీరు మారుతుండటం గురించి చెప్పారు.

తుపాన్‌ బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన ఈ పర్యటనకు వచ్చారు.

"వల్గర్‌ లాంగ్వేజ్‌ నేను మాట్లాడను. ప్రజల్లో చైతన్యం తెస్తా. అందరిలా బూతు పంచాంగం నా జీవితంలో లేదు. ఒకప్పుడు వీరోచితంగా పోరాడా. ఈరోజు బూతుల పంచాంగం వినాల్సి వస్తున్నది. కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఏ త్యాగానికైనా నేను సిద్ధం.ఒక స్పష్టమైన విజన్‌తో వస్తా. ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా కాపాడాలో ఒక ప్రణాళిక ప్రకారం వెళతా," అని ఆయన అన్నారు.


ఎంత పంట నష్టం జరిగింతో ఇంతవరకు తేల్చలేదు

ఇంతవరకు ఎంత పంటనష్టం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించక పోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏ పంట ఎంత నష్టపోయిందో చెప్పిందా? ఏమి చెప్పకుండా ఏ నష్టం జరగలేదని చెబుతారు. ఇది పెద్ద విపత్తు అవునా? కేంద్రం కూడా ఈ విపత్తును నుంచి రైతులను ఆదుకోవడానికి కేంద్రాన్ని ముఖ్యమంత్రి అడిగాడా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి చేయడు కాబట్టి నేనే ఒక లెటర్‌ ప్రధానకి రాసి సాయం అడుగుతానని ఆయన అన్నారు.
తెలియకపోతే నేర్చుకోవాలి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ నేర్చుకోవడమేలేదని ఆయన అన్నారు.
"తెలియని తనం ఉంటే నేర్చుకోవాలి. కానీ నేర్చుకోకుండా పోవడమే అహంకారం. అదే మనందరినీ నాశనం చేస్తుంది. కలెక్షన్‌లలో చాలా తెలివి. పేదవాడికి సాయం చేయడానికి మనసు రాదు. మాటలు చెప్పడానికి మనసు వస్తుంది. 25 కేజీల బియ్యం, ఒకటో రెండో బంగాళా దుంపలు ఇచ్చి నాపనైపోయిందంటాడు. ఇదీ ప్రభుత్వం తీరు," అని అన్నారు.



Next Story