ప్రొ. సాయిబాబా సంస్మరణ సభలో వక్తలు


మేధావులను అక్రమంగా నిర్భంధించి, స్వేచ్ఛ కు సంకెళ్లు వేస్తూ కుట్ర పన్నుతున్న రాజ్యానికి వ్యతిరేకంగా మేధావులు కవులు కళాకారులు ఏకమై పోరాడాలని వక్తలు అన్నారు. ఇటీవల అస్తమించిన ఉద్యమ సూర్యుడు మేధావి ప్రొఫెసర్ జీయన్ సాయిబాబా సంస్మరణ సభ నగరం లోని లలిత కళాసమితిలోబుధవారం రాత్రి జరిగింది. కర్నూలు కవులు నిర్వహించిన సభకు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగారమోహన్ అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు ఆయన చిత్ర పటానికి జోహార్లు అర్పించారు. సభ కు హాజరైన ప్రజాభ్యుదయ సంస్థ నాయకులు భార్గవ మాట్లాడుతూ సాయిబాబా పేదలు, ఆదివాసీలు, స్తూలంగా మానవహక్కులకోసం పోరాడి అలసి సొలసి మనపై భాద్యత ఉంచి వెళ్ళారని ఆయన ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం ప్రగతిశీల వాదులపై ఉందన్నారు. దేశం ఒక గొప్ప మేధావి ని కోల్పోయిందన్నారు.

విరసం నాయకులు పాణి మాట్లాడుతూ సమాజం కొత్త దశకు చేరుకుంటున్న కాలం లో సాయిబాబా అర్థ మౌతాడన్నారు. ఆయన జైలు గదిలో రాసిన నేను చావును నిరాకరిస్తున్నాను అని రాశాడన్నారు. సాయి లోతైన కవిత్వం రాశాడన్నారు. అనేక పోరాటాలను కవిత్వంగా రాశాడాన్నారు. జైలు లో ఆయనను బంధించవచ్చనుకుని రాజ్యం అనుకుంటే కానీ అతడు బయటకొచ్చి గొప్ప మానవుడుగా వచ్చాడన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ సాయిబాబా కవిగా మేధావిగా కొత్త సమాజం కోసం కృషి చేశాడన్నారు. ప్రభుత్వానిర్భంధం ఎదుర్కొని స్వేచ్చ లభించిందనుకుంటున్న సందర్భం లో అస్తమించడం దారుణమన్నారు. విరసం నాయకులు నాగేశ్వరాచారి మాట్లాడుతూ రాజ్యం చేసిన కుట్ర కు బలైన మేధావి సాయిబాబా అన్నారు. మేధావులను కోల్పోవడం దురదృష్ట కర పరిణామం అన్నారు. సభ ప్రారంభనికి ముందు నంది అవార్డు గ్రహీత మొహమ్మద్ మియా అభ్యుదయ గేయాలను పాడగా సభకు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ ఆహ్వానం పలికారు. సభలో కవులు రచయితలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఇనాయతుల్లా, మారుతీ పౌరోహితం, రత్నం యేసేపు, ఆద్య మెడికల్స్ అధినేత ఏవి రెడ్డి, జె వివి శేషాద్రి రెడ్డి, బీడీ సుధీర్ రాజు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Next Story