కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించనునంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కొత్త స్కీంను తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.778.68 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు కిట్ లు అందజేస్తారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు కిట్ లో వుంటాయి. సగటున ఒక్కో కిట్ కు రూ.1,858 ఖర్చు కానుంది. యూనిఫాం తయారీకి సంబంధించి 8వ తరగతి వరకు రూ.120, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల యూనిఫాంలకు రూ.240 చొప్పున ప్రభుత్వం కుట్టుకూలీ చెల్లించనుంది.
Next Story