
రేణిగుంట విమానాశ్రయం (ఫైల్)
Tirupati Airport | తిరుపతి నుంచి సింగపూర్... ఒక్కరితో వెళ్లిన విమానం
రేణిగుంట నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైంది. అందులో నలుగురు సిబ్బంది ఉన్నారు.
తిరుపతి విమానాశ్రయం విస్తరించిన సుదీర్ధ విరామం తరువాత అంతర్జాతీయ విమానసర్వీసు ప్రారంభమైంది. ఇక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లిన విమానంలో ఓకే ప్రయాణికుడు ఉండడం గమనార్హం.
"ఇది ట్రయల్ రన్ మాత్రమే" అని తిరుపతి విమానాశ్రయం టెర్మినట్ మేనేజర్ కార్తీక్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి మాట్లాడుతూ, చెప్పారు. విమానంలో ప్రయాణించిన మొదటి ప్రయాణికుడు, ఏ ఎయిర్ లైన్ అనే విషయాలు పంచుకోవడానికి ఆయన సుముఖత చూపలేదు.
సంస్థ కంటే వీఐపీలే ప్రధానం
తిరుపతి ఆధ్మాత్మిక కేంద్రం కావడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు ఆకాశమార్గాన కూడా చేరుకుంటున్నారు. అందులో విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలోని డొమస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి కూడా సర్వీసలు నడుపుతున్నారు. దీంతో తిరుపతి విమానాశ్రయానికి సాధారణ యాత్రికులతో పాటు వీఐపీ, వీవీఐపీల తాడికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో
కేంద్రంలో గత యూపీఏ పాలనలో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తృతం చేయడం ద్వారా రన్ వే కూడా ఏర్పాటు చేసిన దాదాపు 15 ఏళ్ల తరువాత సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభమైంది. దీనిపై
"వివరాలు చెప్పే సమయం, తీరిక లేదు. వీఐపీలు వస్తుంటారు. వారిని స్వాగతించాలి" అని టెర్మినల్ మేనేజర్ కార్తీక అసహాయత వ్యక్తం
దేశంలో విమానయానరంగాన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో డొమస్టిక్ విమానాల సంఖ్యను కూడా పెంచడంతో పాటు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాటికే రేణిగుంట విమానాశ్రయం నుంచి ముంబైతో పాటు దేశంలోని అనేక నగరాలను అనుసంధానం చేస్తూ విమానయాన సర్వీసులు ఇటీవల ప్రారంభించారు. అందులో భాగంగా
తిరుపతి విమానాశ్రయం నుంచి సింగపూర్ కు ఓ ప్రయాణికుడు, నలుగురు సిబ్బందితో మొదటి అంతర్జాతీయ విమానసర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని విమానాశ్రయ డైరెక్టర్ మన్నే శ్రీనివాసరావు ఒకరోజు కిందటే వెల్లడించారు. కొన్ని సాంకేతిక విషయాలను కూడా ఆ ప్రకటనలో ప్రస్తావించినా, వాటి వివరాలు తెలుసుకునేందుకు మాత్రం ఆయన అందుబాటులో లేరు.
"సింగపూర్ కు బయలుదేరిన అంతర్జాతీయ విమానసర్వీసు ఆపరేటర్ ఎం/స్ లక్స్ ఏవియేషన్ సాన్ మారినోగా వెల్లడించారు. ప్రయాణ ఉద్దేశం పూర్తిగా ప్రైవేటు" అని స్పష్టం చేశారు. "ఈ విమానంలో ఒక ప్రయాణికుడు, నలుగురు సిబ్బంది ఉన్నారు" అని వెల్లడించారు.
Next Story