కనిగిరిలో రాజుకున్న నిప్పు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పుతో నియోజకవర్గాల్లో నిప్పు రాజుకుంటోంది. ప్రత్యామ్నాయం వైపు ఎమ్మెల్మేల చూపు పడుతోంది.


కనిగిరిలో రాజుకున్న నిప్పు
x
CM Jagan with Burra Madhusudhan Yadav, MLA, Kanigiri

కనిగిరి నియోజకవర్గంలో నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ లేదని సీఎం జగన్‌ చెప్పడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పది ఏళ్లకు పైగా బుర్రా పార్టీకోసం నిత్యం కష్టపడి పనిచేస్తున్నాడని, అటువంటి వ్యక్తిని కాదని వేరే వారికి టిక్కెట్‌ ఇవ్వటం ఏమిటని నియోజకవర్గంలోని మండ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కనిగిరిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ను పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డగించి ఆయనను పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా ఫోర్స్‌ చేశారు. మనకు గ్రెస్‌ పార్టీ ఉంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేద్దామంటూ నినాదాలు చేశారు. వారికి నచ్చజెప్పి ముందుకు సాగారు బుర్రా.
పామూరు ఎంపీపీ రాజీనామా
పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మీహుస్సేన్‌రెడ్డి ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. పామూరు వైఎస్సార్‌సీపీ కార్యలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పామూరు మండలంలో ఇప్పటి వరకు 21 మంది సర్పంచ్‌లు రాజీనామా చేసినట్లు పామూరు మండల పార్టీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్‌రెడ్డి వెల్లడించడం విశేషం. కనిగిరి ఎమ్మెల్యే బుర్రాకు వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయని, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి బుర్రాపై గుర్రుగా ఉన్నారని అందుకే సీటు దక్కలేదని పలువురు అంటున్నారు.
జంకెకు కూడా సీటు లేనట్లేనా..
ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి కూడా టిక్కెట్‌ లేనట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడైన జంకెకు గత ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా 2024లో సీటు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఇప్పుడు గాలికి కొట్టుకుపోయినట్లైంది. జంకెకు ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటనేది వేచి చూడాల్సిందే.
Next Story