ఎక్స్‌లో షర్మిల షేర్‌ చేసిన అరుదైన వైఎస్‌ఆర్‌ ఫొటో
x

ఎక్స్‌లో షర్మిల షేర్‌ చేసిన అరుదైన వైఎస్‌ఆర్‌ ఫొటో

ఓటేసే ముందు తండ్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వెళ్లిన షర్మిల, బ్రదర్‌ అనిల్‌.


తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తాను దిగిన అపుపూర చిత్రాన్ని షర్మిల ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో తన ట్వీటర్‌ ఖాతా నుంచి ఈ ఫొటోను పంచుకోవడం గమనార్హం. తన తండ్రి వైఎస్‌ఆర్‌తో తనకున్న అనుబంధాన్ని మరో సారి చాటుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మాటలను కూడా పంచుకున్నారు. ‘ రాష్ట్ర భవితను మార్చే ఎన్నికల పండగ వేళ, ఒకప్పడు మా తండ్రి డాక్టర్‌ స్వర్గీయ వైఎస్‌.రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఒక అపురూపమైన అనుభూతి. ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్మ నాన్న ఆశీస్సులు, దేవుడి దీవెన,ప్రజల ఆశీర్వాదం నాకున్నాయని నమ్ముతున్నాను ’ అని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

అంతకుముందు ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లారు. ఓట్లేసే ముందు సోమవారం ఉదయం భర్త బ్రదర్‌ అనిల్, కుమార్తెతో కలిసి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించారు. పుష్ప గుచ్చాలతో ఘనమైన నివాళులు అర్పించారు. తనంతరం భర్త బ్రదర్‌ అనిల్‌తో ప్రేయర్‌ చేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్పందనను ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘ఒక మహత్తర పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇవాళ ఓటు వేసే ముందు, నాకు జన్మను మాత్రమే కాదు, అంతకు మించి స్పూర్తి, పోరాట పటిమన ఇచ్చిన మా తండ్రి, మహానేత, డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను’ అని వెల్లడించారు. తర్వాత అక్కడ నుంచి ఇడుపులపాయలోని పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More
Next Story