మనువాదుల హెచ్చరికో..హెచ్చరిక!
x

మనువాదుల హెచ్చరికో..హెచ్చరిక!

77 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి చెద పట్టిస్తున్నారా? దేశమంతటా సనాతన సందేశం వినిపిస్తున్నారంటున్న ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు ఆవేదన ఏంటో చదవండి..


ఏమిటీ మనువాదం? ఎందుకీ వివాదం? 77 ఏళ్ల స్వాతంత్ర్యంలో మనం ముందుకు వెళుతున్నామా లేక వెనక్కి వెళుతున్నామా, ఈ విశ్వగురువులు ఎవు, వీళ్లు ప్రవచిస్తున్న సందేశం ఏమిటీ, ఇప్పుడెందుకీ వివాదం అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు.
సింహాసనాధిష్టులు
మనువాదమతవాద
ఫాసిస్టు చక్రవర్తుల
హెచ్చరికో హెచ్చరిక!
స్వతంత్ర భారతం
ప్రజాస్వామ్యం పేరుతో
77సంవత్సరాలుగా
అంతా అస్తవ్యస్తం!
మనుస్మృతి రాజ్యాంగం
చెలామణి ఔతుంది!
సనాతన ధర్మాలతో
పాతరోజులే వస్తాయి!
సూద్రులు కష్టపడాలి
ధనికులు పాలించాలి
బ్రహ్మణో మమ దేవత
వ్యాపారం సర్వం వైశ్యం!
చాతుర్వర్ణ వ్యవస్థ
సుభిష్ట రాజ్యప్రతిష్ట
ఎక్కడివాళ్ళక్కడే
కులవృత్తుల రాజ్యం¡
అంబేద్కర్ మాట వద్దు
అతనిబొమ్మ తొలగించాం!
వాళ్లంతాఅస్పృస్యులు!
మాది సనాతన సం'దేశం'!
సతీ సహాగమనాలు
బాల్య వివాహాలు
స్త్రీకి వంటిల్లే సౌఖ్యం
దేవదాశీ!వేశ్యావృత్తి!
సైన్స్ మాట విన్నా
వైజ్ఞానికమని అన్నా
చెవిలో సీసం పోస్తాం
నాలుక కోస్తాం జాగ్రత్త!
సంస్కృత శ్లోకాలతో
పురాణ పఠనాలతో
గుళ్లన్నీవేదమంత్రాలతో
శ్రవణానందం కావాలి!
విశ్వగురు మహారాజా
ప్రకటించిన ప్రకటనసారం!
ప్రజలు సిద్ధం కావాలని
హెచ్చరికో!హెచ్చరిక!!

తమ్మినేని అక్కిరాజు


Read More
Next Story