మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట ఏసీబీ సోదాలు..
x

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట ఏసీబీ సోదాలు..

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి 15 మంది అధికారుల బృందం ఈ తనిఖీలు చేస్తోంది.


మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి 15 మంది అధికారుల బృందం ఈ తనిఖీలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలోని ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేపట్టిన అధికారులు నివాసంలోని ఎవరినీ బయటకు రాకుండా, బయటి వారు లోపలికి రాకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల అన్యాక్రాంతంపై సీఐడీ కేసునమోదు చేసింది. నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపడుతోంది.

అయితే విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సీఐడి గతంలో అటాచ్ చేసింది. ఇదే సర్వే నంబర్లలో ఉన్న భూమిని తాను కొనుగోలు చేసినట్లు మాజీ మంత్రి, వైసీపీనేత జోగి రమేష్.. పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారంటూ అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై సీఐడీ విచారణ ప్రారంభించింది. అటాచ్‌మెంట్‌లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో జోగి రమేష్ సహా ఆయన కుమారుడి పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలోని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి సర్కార్ ఆదేశించడంతో ఏసీబీ తన స్పీడు పెంచింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. జోగిరమేష్ ప్రమేయంతోనే అధికారులంతా కలిసి ఈ భూములను కబ్జా చేయడానికి ప్లాన్‌ను రచించారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వీటిని నిర్ధారించుకోవడానికే వారు జోగి రమేష్ నివాసంలో తనిఖీలు చేపట్టి ఫైళ్లను పరిశీలిస్తోంది.

Read More
Next Story