అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌కు ఊరట.. బెయిలిచ్చిన కోర్టు..
x

అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌కు ఊరట.. బెయిలిచ్చిన కోర్టు..

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు.


మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేస్తున్నారని, ఈ కేసును తాము చట్టపరంగా ఎదుర్కొంటామని అరెస్ట్ సమయంలో జోగి రాజీవ్ వ్యాఖ్యానించారు. అదే విధంగా అరెస్ట్‌ అయినప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న రాజీవ్‌కు తాజాగా ఊరట లభించింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌తో పాటు, సర్వేయర్ రమేష్‌ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జోగి రాజీవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న విజయవాడ జైలు దగ్గర పోలీసులు అప్రమత్తమై, ఆయన విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయవాడలోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ కేసు విచారణలో ప్రాథమిక ఆధారాల ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ సహా మరో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఆ భూకబ్జాలకు సంబంధించే ఈరోజు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం సోదాలు ప్రారంభించారు. ఫైళ్లను కూడా పరిశీలించారు. అనంతరం జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రాజీవ్ అరెస్ట్ సందర్భంగా జోగి రమేష్.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కొడుకులు ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించడం ఎవరికీ మంచిది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు తన వంకర బుద్ది మార్చుకుంటే మంచిది. ఈరోజు జరిగిన ఏసీబీ దాడులు జోగి రమేష్, రాజీవ్‌పై జరిగినవి కావు.. బలహీన వర్గాలపై జరిగిన దాడులు. చంద్రబాబు ప్రతీకారాలు పక్కనపెట్టి ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చండి. ప్రజల దృష్టిని హామీలపై నుంచి మళ్లించడానికే చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’’ అని హితవుపలికారు.

అంబాపురం భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు విచారణలో భాగంగానే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో జోగి రాజీవ్ ఏ1గా ఉండగా, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఏ2గా ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజీవ్‌ను గొల్లపూడి కార్యాలయానికి తరలించారు అధికారులు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నేటికి విచారణ ముగిసింది. అనంతరం ఈ కేసు విచారణకు సెప్టెంబర్ 3కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో జోగి రమేష్.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ తదుపరి వాయిదా సెప్టెంబర్ 3న జరగనుంది.

Read More
Next Story