పాడి ఆవు లాంటి విశాఖ డైరీ నుంచి శక్తి కి మించి అవినీతితో పితికి ఒట్టి పోయేలా చేసింది ఆడారు కుటుంబమని జనసేన కార్పొరేటర్ మూర్తి విమర్శలు గుప్పించారు.
విశాఖ డైరీని ఆడారు కుటుంబం నాశనం చేసిందని, కొడుకులు, కూతురు, ఆడపడుచులు బావ మరుదులు అంతా కలిసి కార్మికులు కష్టాన్ని కళాఖండ చేసి తినేశారని ధ్వజమెత్తారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు, టీడీపీలోలో శాసన సభ్యులు ఓటమి కూడా పని చేసిన చేసిన ఘనత ఆడారు కుటుంబానిదని మండిపడ్డారు. సొమ్ములు పాడి రైతులవి సోకులు ఆడారు కుటుంబానిదని ధ్వజమెత్తారు. ఆడారు రాజకీయంగా చేసే ప్రతి పనీ విశాఖ డైరీ నుంచి ఉన్న నిధులే అన్నారు. చివరికి సిద్ధం సభలకు విశాఖ డైరీ మజ్జిగ ప్యాకెట్లు పంచి డైరి సోమ్ము వైసిపి పాలు చేశారని విమర్శించారు. అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న విశాఖ డైరీ దివాళాకు తలుపులు తెరిచేలా చేశారని మండి పడ్డారు. రెండు వేల కోట్ల టర్నవర్‌తో ఉన్న విశాఖ డైరీ నేడు నష్టాలలో ఉందని,అప్పులు తీసుకునే పరిస్థితిలో ఉందన్నారు.
మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో విశాఖ డైరీ పేరుతో 50 ఎకరాల భూమిని కొన్నారని, ఈ భూముల వ్యవహారంలో రూ. 10 కోట్ల రూపాయలను ఆడారి కుటుంబం కొట్టేసిందని ఆరోపించారు. విశాఖ డైరీ ఎంప్లాయిస్‌కి ఇల్లు కట్టిస్తామని ఒక్కఒక్కరి దగ్గర నుంచి రూ. 86 వేలు వసూలు చేశారని మండిపడ్డారు. ఉదోగులు డబ్బులతో నరవ వద్ద మూడు ఎకరాల భూమిని కొని అందులో 90 సెంట్లు భూమిని ఆడారి కుటుంబ సభ్యులు ఉచితంగా రాయించుకున్నారని, మిగిలిన భూమిని ఓ వైసిపి నేతకి డెవలప్మెంట్ కి ఇచ్చి అందులో కొన్ని ప్లాట్ లను ఆడారి కుటుంబం కొట్టేసిందని ఆరోపించారు. పిఎస్‌ల్ ట్రస్ట్ లో ఉన్న ఆరు కోట్ల రూపాయలు నగదు ఆడారి ఆనంద్ ఎన్నికల్లో రాజకీయం కోసం వాడుకున్నారని విమర్శించారు. పాతిక లక్షల విశాఖ డైరీ డబ్బులతో వాల్తేర్ క్లబ్‌లో ఎమ్‌డిఎస్‌వి రమణ పేరుతో సభ్యత్వం తీసుకున్నారని ఆరోపించారు. విశాఖ డైరీ ఆస్తులను డైరెక్టర్లకు దారా దత్తం చేశారని విమర్శించారు.
విశాఖలో ఆడారి కుటుంబం రూ. 500 కోట్లు విలువ చేసిన 7.96 ఎకరాలప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దీనిని తన వశం చేసుకునేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 200 కోట్లు ఇచ్చారని, విలువైన భూమిని కబ్జా చేస్తే జిల్లా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఆడారి ఆనంద్ అమెరికాలోని 500 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశాఖ డైరీ సొమ్ముతో పెట్టుబడి పెట్టారని విమర్శించారు. విశాఖ డైరీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీఎం చంద్రబాబు నాయుడుకి, ఆదాయ పన్ను శాఖకు, సిబిఐకి,ఈడికి, న్‌డిడిబికి ఫిర్యాదు చేశానన్నారు. విశాఖ డైరీ సంపదను, పాడి రైతుల కష్టాన్ని దోచుకున్న ఆడారి కుటుంబంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.