ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా, వ్యవసాయ మంత్రి ఆ రంగం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.


ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌లను మంత్రులు పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లను ప్రవేశ పెట్టడం ఇద్దరి మంత్రులకు మొదటి అనుభవం. అచ్చెన్నాయుడు గతంలో పలు మార్లు మంత్రిగా పని చేసినా, బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనుభవం లేదు. పయ్యావుల కేశవ్‌ తొలి సారి మంత్రి అయ్యారు. ఇద్దరి మంత్రుల బడ్జెట్‌ ప్రసంగాలు పూర్తి అయిన తర్వాత సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ బడ్జెట్‌ సందర్భంగా సభ్యులందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఉన్నాయని, అందరూ భోజనం చేసి వెళ్లాలని సభ్యులందరికీ సూచించారు.

బడ్జెట్‌ సమావేశాలు కావడం వల్ల బడ్జెట్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని చర్చించేందుకు సాధారణంగా ఒక రోజు సమయం ఇస్తారు. అందులో భాగంగానే మంగళవారం సమావేశాలు జరగడం లేదు. బుధవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
Next Story