రంగరంలోకి దిగిన అచ్చెన్నాయుడు.. ఆధికారులకు ఆదేశాలు
x

రంగరంలోకి దిగిన అచ్చెన్నాయుడు.. ఆధికారులకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించి వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం శాఖలోని లోటుపాట్లు, పరిస్థితులు వంటి పలు అంశాల గురించి అధికారులను అడిగిన రివ్యూ తీసుకున్నారు. తీసుకోనున్న శాఖా పరమైన చర్యలను వారికి వివరించారు. అంతేకాకుండా వారు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వారికి దిశానిర్దేశం చేశారు. రానున్న ఖరీఫ్ పంటల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యల గురించి ఆయన.. వ్యవసాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జీకే ద్వివేది సహా పలువురు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు అచ్చెన్నాయుడు.

కొరత లేకుండా చర్యలు

ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు అచ్చెన్నాయుడు ఆదేశాలిచ్చారు. వారికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా నాణ్యమైనవే అందించాలని, నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై కొరడా ఝులిపించాలని చెప్పారు. అంతేకాకుండా రైతులకు అందాల్సిన అన్ని ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ది దారు పొందేలా చర్యలు తీసుకోవాలని, ఈ నెల 18న రైతులకు అందించాల్సిన పీఎం కిసాన్‌లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని చెప్పారు. సమయానికి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలని వెల్లడించారు. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. దాంతో పాటుగా రైతులకు అధికారులు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని తగిన పరిష్కారాలు చూపాలని తెలిపారు.

కొనుగోలుపైనా దృష్టి

కేవలం రైతులకు పంటకు సంబంధించే కాకుండా వాటి కొనుగోలు విషయంలో కూడా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు. తమ పాలనతో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, రైతుల సమస్యలను తీర్చడానికి శాయశక్తుల ప్రయత్నిస్తానని చెప్పారు. రైతులకు అందే ప్రతి సహాయం సమయానికి చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయిన హెచ్చరించారు.

Read More
Next Story