ఏపీసీసీ నూతన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..
x

ఏపీసీసీ నూతన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీసీసీ కమిటీలను రద్దు చేస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీసీసీ కమిటీలను రద్దు చేస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా సదరు కమిటీల గదులకు తాళాలు కూడా వేయడం ఏపీ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయానికి సంబంధించే షర్మిలను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, ఆమె ఒంటెద్దు పోకడల వల్లే అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కస్థానం కూడా గెలవలేకపోయిందంటూ కొందరు నేతలు ఏఐసీసీకి వినతి పత్రం కూడా అందించారు. అప్పటి నుంచి ఏఐసీసీలో షర్మిల ఒకవైపు ఆమెను వ్యతిరేకిస్తున్న వారు మరోవైపుగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ వివాదాల నేపథ్యంలో తాజాగా ఏపీసీసీ నూతన కమిటీలకు పిలుపునిచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్ సిఫార్సు చేసిన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13 మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రరెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

- మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు

- శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు

- విజయనగరం - మరిపి విద్యాసాగర్

- విశాఖపట్నం - వెంకట వర్మ రాజు

- అనకాపల్లి - మీసాల సుబ్బన్న

- కాకినాడ - మద్దేపల్లి సత్యానందరావు

- బిఆర్ అంబేద్కర్ కోనసీమ - కొండేటి చిట్టిబాబు

- ఈస్ట్ గోదావరి - TK విశ్వేశ్వర్ రెడ్డి

- వెస్ట్ గోదావరి - హరి కుమార్ రాజు

- ఏలూరు - రాజనాల రామ్మోహన్ రావు

- కృష్ణ - గొల్లు కృష్ణ

- NTR - బొర్రా కిరణ్

- గుంటూరు - చిలక విజయ్

- బాపట్ల - ఆమంచి కృష్ణమోహన్

- పల్నాడు - అలెక్స్ సుధాకర్

- ప్రకాశం - షేక్ సైదా

- నంద్యాల - జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్

- కర్నూలు - పరిగెల మురళి కృష్ణ

- అనంతపురం - మధుసూదన్ రెడ్డి

- YSR - విజయజ్యోతి

- శ్రీ సత్యసాయి - హినయ్ తుల్లా

- SPS నెల్లూరు - చేవూరు దేవ కుమార్ రెడ్డి

- తిరుపతి - బాలగురవం బాబు

- చిత్తూరు - పోటుగారి భాస్కర్

విజయవాడ సిటీ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు

కాకినాడ - చెక్కా నూకరాజు

రాజమండ్రి - బాలేపల్లి మురళీధర్

శ్రీకాకుళం - రెల్లా సురేష్

విశాఖపట్నం - పిరిడి భగత్

తిరుపతి - గౌడపేరు చిట్టిబాబు

చిత్తూరు - టిక్కారాం

ఒంగోలు - నాగలక్ష్మి

కర్నూలు - షేక్ జిలానీ భాషా

కడప - అఫ్జల్ అలీ ఖాన్

ఏపీసీసీలో వివాదం ఇదే..

ఏపీ కాంగ్రెస్‌ కమిటీలన్నీ రద్దయినప్పటి నుంచి పార్టీలో షర్మిలపై వ్యతిరేకత పెరిగింది. ఆ తరువాత ఆయా కమిటీల ఇన్‌చార్జ్‌లకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో కేటాయించిన రూములకు షర్మిల తాళాలు వేయడం ఈ వ్యతిరేకతను మరింత అధికం చేసింది. దీంతో పార్టీలోని విభాగాలకు చెందిన వారు కూడా హాజరు కావడం లేదు. కొత్త కమిటీల్లో ఎవరిని నియమిస్తారో.. అందుకు ఏ విధమైన విధానాన్ని అవలంభిస్తారో ఇంత వరకు ప్రకటించలేదు. పార్టీ అనుబంధ విభాగాలకు నాయకులు లేకపోవడంతో పార్టీలో నిస్సత్తువ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌ ఇలాగే ఉండిపోతుందా? ఏమైన జవసత్వాలు కూడగట్టుకుని ముందుకు సాగుతుందా అనేది పలువురిలో ఉన్న సందేహం. పార్టీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో శాశ్వతంగా ప్రజలు దూరంగా ఉంటారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త కమిటీల ఏర్పాటులో ఎందుకు అడుగు ముందుకు పడటం లేదో షర్మిల కూడా చెప్పవడం లేదని కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్‌లు వ్యాఖ్యానించడం విశేషం.

Read More
Next Story