మద్యం ధరలు బాగా తగ్గనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియుల వల్లే భారీ మెజారిటీ వచ్చివందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కంటే తక్కువ ధరకు మద్యం అమ్మాలనే ఆలోచనకు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై అధ్యయనం చేసిన బ్రుంధం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వచ్చేనెల 1నుంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టనుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం విధానం అమలుపై ప్రభుత్వం చర్చించింది.

రాత్రి 10 గంటల వరకు...

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంటుందని కేబినెట్ కూడా స్పష్టం చేసింది. వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబిస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తామన్నారు. షాపు లైసెన్స్ కోసం రూ. 2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాలి. లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం తిరిగి ఇవ్వరు. (నాన్ రిఫండబుల్) అని మంత్రి పార్థసారథి చెప్పటం విశేషం. గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సులలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మద్యం ధరల వివరాలు

మద్యం ధరలు దాదాపు సగానికి సగం తగ్గనున్నాయి. గత ప్రభుత్వంలో దశలవారీగా మద్య నిషేధం తీసుకొస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ పనిచేయకపోగా మద్యం ధరలను అమాంతం పెంచారు. సగానికి సగంపైన ధరలు పెరిగాయి. ఇంత భారీ స్థాయిలో మద్యం ధరలు పెరగటం ఇదే మొదటిసారి. దేశంలోనే ఈ స్థాయిలో మద్యం ధరలు ఏపీలో తప్ప మరెక్కడా లేవనే చర్చ సాగింది. పైగా మద్యం వ్యాపారం గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే జరిగింది. క్సైజ్ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి.

1. విస్కీ 2. బ్రాందీ 3. వోడ్కా 4. బీర్ 5. రమ్

మాన్షన్ హౌస్ (బ్రాందీ): 180ml రూ. 120/-, 360ml రూ.230/-, 750ml రూ.460/-

ఇంపీరియల్ బ్లూ (విస్కీ): రూ. 120/-, రూ. 230/-, రూ. 460/-

మెక్‌డోవెల్ నం.1 (విస్కీ): రూ. 140/-, రూ. 280/-, రూ. 580/-

స్టెర్లింగ్ రిజర్వ్ B7(విస్కీ): రూ. 140/-, రూ. 280/-, రూ. 580/-

(విస్కీ) B10: రూ. 160/-, రూ. 310/-, రూ. 640/-

బ్లెండర్స్ ప్రైడ్ (విస్కీ): రూ. 200/-, రూ. 400/-, రూ. 800/-

రాయల్ స్టాగ్ (విస్కీ): రూ. 140/-, రూ. 280/-, రూ. 580/-

(వోడ్కా)

గ్రీన్ యాపిల్ : రూ. 150/-, రూ. 300/-, రూ. 600/-

నారింజ రంగు: రూ. 160/-, రూ. 340/- రూ. 650/-

స్ట్రాబెర్రీ (లూనో) : రూ. 200/-, రూ. 400/-, రూ. 800/-

సంపూర్ణ వోడ్కా: రూ. 220/-, రూ. 480/-, రూ. 920/-

స్మ్రిన్ ఆఫ్ రూ. 220/-, రూ. 480/-, రూ. 920/-

బకార్డి రమ్ (నిమ్మకాయ): రూ. 240/-, రూ. 520/-, రూ. 1020/-

(బీర్)

కింగ్‌ఫిషర్ అల్ట్రా స్ట్రాంగ్ రూ. 130/-, నాకౌట్ అల్ట్రా స్ట్రాంగ్ రూ. 120/-, ఖజరహో అల్ట్రా స్ట్రాంగ్ రూ. 120/-, బడ్‌వైజర్ అల్ట్రా స్ట్రాంగ్ రూ. 160/-.

Next Story