గత ప్రభుత్వం బేసిక్ ప్రైస్ భారీగా పెంచింది. ఇప్పుడవి తగ్గనున్నాయి. కంపెనీలే తగ్గించుకోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గనున్నాయి. ప్రభుత్వం తగ్గించడం లేదు. కంపెనీలే తమ ధరలను తగ్గించుకుంటున్నాయి. దీంతో వినియోగదారులకు భారం తగ్గనుంది. గత ప్రభుత్వంలో భారీగా మద్యం బేసిక్ ప్రైస్‌ను పెంచింది. అయితే ఇప్పుడు మద్యంను సరఫరా చేస్తున్న కంపెనీలే తమ బేసిక్ ధరలను తగ్గించుకునేందుకు ముందుకొచ్చాయి. మద్యం సరఫరా చేస్తున్న వాటిల్లో దాదాపు 11 కంపెనీలు తమ బేసిక్ ధరలను తగ్గించుకునేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయా సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ సంస్థ కొనే ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ఎమ్మార్పీ ధరల్లో మార్పులు రానున్నాయి. బ్రాండ్ల ఆధారంగా క్వార్టర్ ధర ఎమ్మార్పీల కంటే దాదాపు రూ. 30 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో మద్యం ప్రియులకు భారం తగ్గనుంది.
Next Story