హాయ్ విజయ్, ఆల్ ది బెస్ట్ అని పవన్ కల్యాణ్ ఎందుకన్నాడు?
x

హాయ్ విజయ్, ఆల్ ది బెస్ట్ అని పవన్ కల్యాణ్ ఎందుకన్నాడు?

హాయ్ విజయ్, ఆల్ ది బెస్ట్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పవన్ కి,విజయ్ కి జేజేలు పలుకుతున్నారు.


తెలుగునాట సినీనటుల హవా పెరుగుతున్న నేపథ్యంలో మరో మల్టీస్టారర్, కోలీవుడ్ ఫేం విజయ ఎలియాస్ జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళనాడులో రాజకీయ రంగప ప్రవేశం చేశారు. చెన్నైలో ఆదివారం ఆయన పార్టీని ప్రారంభించారు. 'తమిళిగ వెట్రీ కళగమ్' పార్టీని స్థాపించిన విజయ్ కి మరో నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందలు తెలిపారు. హాయ్ విజయ్, ఆల్ ది బెస్ట్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయ స్ఫూర్తి అంటే అలా ఉండాలంటూ పవన్ కి,విజయ్ కి జేజేలు పలుకుతున్నారు.


కోలీవుడ్‌ నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ అభినందనలు తెలిపారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని పవన్ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకట్టుకుంది.

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ‘‘ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా.’’ అని విజయ్ తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకుందని చెబుతున్నారు.
Read More
Next Story