
పవన్ కల్యాణ్ వద్దకు క్యూ కట్టిన కూటమి నేతలు.. తిరుపతి ఆకస్మిక పర్యటన..
ముమ్మర ప్రచారంలో ఉన్న పవన్ కల్యాణ్ సోదరులు హుటాహుటిన తిరుపతి రావడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ ఎందుకు వస్తున్నారనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతన్నాయి.
టీడీపీ, బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి క్యూ కట్టారు. తమ నియోజకవర్గాలలో ప్రచారం కోసం రమ్మని ఆహ్వానిస్తున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు జనసేన నేత పవన్ కల్యాణ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్, గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కలిశారు. ఉదయం పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పవన్‌కల్యాణ్‌ను కలిశారు. మధ్యాహ్నం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. కార్యకర్తలు, నాయకులు మరింత సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని జనసేనాని పవన్‌కల్యాణ్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తణుకు, నిడదవోలు సభల అనంతరం రాజమహేంద్రవరం నగరంలోని ఓ హోటర్‌లో బస చేశారు. పలు నియోజకవర్గాల బాధ్యులు, నాయకులతో విడివిడిగా సమీక్షించారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ప్రభుత్వం రాగానే కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం దక్కేలా చూస్తానని, వారి భవిషత్తుకు తనదే పూచీ అంటూ హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల పనితీరు గురించి చర్చించి దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, భీమవరం, రాజానగరం నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు తదితరులతో వేర్వేరుగా చర్చించారు.