‘సంపద అంటే అప్పా’.. రూ.15 వేల కోట్లపై అంబటి సెటైర్లు
x

‘సంపద అంటే అప్పా’.. రూ.15 వేల కోట్లపై అంబటి సెటైర్లు

కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈసారి బడ్జెట్‌లో ఆంధ్రకు పెద్దపీట పడుతుందనుకున్న ఆంధ్రుల కలలు చెదిరిపోయాయి.


కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈసారి బడ్జెట్‌లో ఆంధ్రకు పెద్దపీట పడుతుందనుకున్న ఆంధ్రుల కలలు చెదిరిపోయాయి. అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించినట్లు ఉదయం నుంచి జరుగుతన్న ప్రచారం కూడా తీవ్ర నిరాశకే కారణమైంది. అందుకు కేంద్రం ఇస్తానన్నది రూ.15వేల కోట్ల నిధులు కాదని కేంద్రమంత్రి నిర్మలమ్మ స్పష్టం చేయడమే కారణం. పలు సంస్థల నుంచి అమరావతి కోసం రూ.15 వేల కోట్ల ఆర్థిక సహాయం పొందడానికి తాము సహకరిస్తామని మాత్రమే చెప్పామని, అంతేకాకుండా ఆ పేరాను అదనపు సహాయానికి కూడా అండగా ఉంటామని మాత్రమే చెప్పామంటూ నిర్మలమయ్య చావు కబురు చల్లగా చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ రూ.15వేల కోట్లపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఓ తెగ చెప్పారు. సంపద సృష్టించడం అంటే అప్పు తెచ్చుకోవడానికి అనుమతి పొందడమా’’ అంటూ చురకలంటించారు. అయితే బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి ఎంతో సహకారం అందిస్తోందని, కేంద్ర సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ సీఎం చంద్రబాబు, లోకేష్, టీడీపీ ఎంపీలు కూడా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన కేటాయింపులపై వైసీటీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని కూడా వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సుమారు పదేళ్ల తర్వాత విభజన అంశం పార్లమెంటులో తెరపైకి వచ్చింది. కానీ ప్రత్యేక హోదా అన్న మాట కూడా వినిపించలేదు. విభజన ప్యాకేజీ ప్రకారం నిధులు ఇస్తామనే కేంద్రమంత్రి చెప్పారు తప్ప.. ప్రత్యేక హోదా ఊసు కూడా ఎత్తలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీని అర్థం.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు రెండూ కూడా అట్టర్ ప్లాన్ అయ్యాయనే. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఒప్పించలేక పోయారని, ఆఖరికి నిధులు కూడా తీసుకురాలేక అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు తీసుకొచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.

అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి కట్టుబడి ఉన్నామని, సహాయం చేస్తామని చెప్పడమే తప్ప ఏం సహాయం చేస్తామో కూడా కేంద్రం చెప్పలేదని గుర్తు చేసింది వైసీపీ. ప్రత్యేక ప్యాకేటీ అని అన్న కేంద్రం.. వెనకబడిన ప్రాంతాలను కొత్త రాగం అందుకుందని, అంతకు మించి చంద్రబాబు ఏం చేయలేక పోయారని విమర్శించింది. మరోవైపు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన రెండో పార్టీ జేడీయూ(బీహార్ పాలిత పార్టీ) మాత్రం తమ రాష్ట్రానికి భారీగా నిధులు సాధించుకుందని, ఇటు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి గుడ్డి సున్నా తెచ్చారని విమర్శించింది.

Read More
Next Story