
అనంతపురం:నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
తెలుగువారు ఉగాదిని ఆస్వాదిస్తున్నారు. అందరి లోగిళ్లలో ఆనందం తాండవిస్తోంది. అనంతపురం జిల్లా మడకశిరలో గోల్డ్ స్మిత్ (ఆచారి) మాత్రం నలుగురు కుటుంబ సభ్యలు మరణాన్ని స్వాగతించారు. ఎంత కష్టం వచ్చిందో ఏమో? తెలియదు. ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో మడకశిర ప్రాంతం విషాదంతో నిండిపోయింది. శనివారం రాత్రి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ ఘటన సమచారం తెలియగానే పోలీసులు రంగప్రవేశం చేశారు.
అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం గాంధీబజార్ లో కృష్ణాచారి నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేష్ ఉన్నారు. వారి కుటుంబంలో ఏమి జరిగిందో తెలియదు. బంగారు వ్యాపారం చేసే ఆ కుటుంబంలో జరిగిన విషయాలు తెలియవు.
తెలుగువారంతా ఉపాధిని స్వాగతించి, పూజల్లో ఉన్నారు. అదే సమయంలో కృష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం పట్టణంలో గుప్పుమంది. ఈ సమాచారం తెలుసుకున్న మడకశిర పట్టణ పోలీసులు కృష్ణాచారి ఇంటికి చేరుకున్నారు. పడక గదిలో నలుగురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగుచూస అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story