వైసీపీ ఎమ్మెల్సీ లీక్ వీడియో ఫేకా షాకా
x

వైసీపీ ఎమ్మెల్సీ లీక్ వీడియో ఫేకా షాకా

వైసీపీకి ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు.


వైసీపీకి ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఇన్ని రోజులు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చ దుమారం రేపింది. దీంతో యాక్షన్ తీసుకున్న వైసీపీ.. ఇటీవల దువ్వాడను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమస్య సమసిపోయిందని రిలాక్స్ అయ్యేలోపు మరో ఎమ్మెల్సీ వ్యవహారం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ ఎమ్మెల్సీ మరెవరో కాదు.. జగన్‌కు సన్నిహితుడుగా అంతా చెప్పుకునే అనంతబాబు. అనంతబాబుకు చెందిన ఓ వీడియోకాల్ క్లిప్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై అనంతం బాబు స్పందించారు. ఇదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి కొందరు గిట్టని వారు చేస్తున్న చర్యలని కొట్టిపారేశారు.

ఆరునెలలుగా బ్లాక్‌మెయిల్

‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. వైరల్ అవుతున్నది మార్ఫింగ్ చేసిన వీడియో. గతంలో ఓ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో వీడియో కాల్ మాట్లాడాను. అప్పుడు పిల్లలకు ముద్దు పెడుతున్న వీడియోను ఇప్పుడు ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో ఆరునెలలుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. హనీట్రాప్ చేసిన పన్నాగం ప్రకారం నన్ను ఈ వీడియోలో ఇరికించారు’’ అని చెప్తున్నారు అనంతబాబు.

అయితే వైసీపీ నాయకులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. గతంలో గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో కూడా ఒకటి దుమారం రేపింది. అంతకన్నా ముందే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌పైన కూడా ఇలాంటి ఆరోపణలు, వాయిస్ రికార్డులు వంటి వైరల్ అయ్యాయి. ఇటీవల రాజ్యసభ వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కూడా దేవాదాయశాఖ అధికారి శాంతికి కడుపు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి, దువ్వాడ వాణి వ్యవహారం హాట్‌టాపిక్‌గా సాగింది. అవన్నీ చల్లబడ్డ వెంటనే ఇప్పుడు అనంతబాబు వీడియో బయటకు రావడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వైసీపీని వివాదాల్లో ఉంచాలనేనా..?

వైసీపీని వివాదాల్లో ఉంచాలన్న ఉద్దేశంతో కొందరు కావాలనే ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలను రేకెత్తిస్తున్నారని వైసీపీ మద్దతుదారులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాల ప్యాటెర్న్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందని, జగన్‌కు సన్నిహితంగా ఉండేవారినే టార్గెట్ చేస్తూ ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారని, తమ స్వార్థాల కోసం ఎదుటివారి క్యారెక్టర్‌ను చంపేస్తున్నారంటూ అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించారు..

తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ గతంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో అనంతబాబు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించారు అనంతబాబు. ఈ సందర్బంగా రంపచోడవరం ఇంఛార్జ్ ఏఎస్పీ మాట్లాడుతూ.. సమగ్ర విచారణ కోసం పూర్తి సమాచారం అందించాలని ఎమ్మెల్సీని కోరినట్లు చెప్పారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే విచారణ ప్రారంభిస్తామని వివరించారు.

Read More
Next Story