భూగర్భ జలాల పరిరక్షణలో అగ్రగామిగా ఆంధ్రపదేశ్‌

భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది. భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం చేసిన సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.


భూగర్భ జలాల పరిరక్షణలో అగ్రగామిగా ఆంధ్రపదేశ్‌
x
Ground water levels image

భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది. దేశంలో 2023–24 సంవత్సరానికి భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం చేసిన సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు (సీజీడబ్లు్యబీ) ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా 6553 బ్లాక్‌లు/మండలాల్లో బూగర్బ జలాల పరిస్థితిపై సీజీడబ్లు్యబీ అధ్యయనం చేసిన విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 667 మండలాల్లో ఈ మేరకు అధ్యయనం కొనసాగించినట్లు సంస్థ ఇటీవల వెల్లడించింది. నైరుతీ, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏటా సగటున దేశంలో 1,236.4 మిల్లీమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1,148.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 835.03 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 714.88 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14.39 శాతం తక్కువని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జల సంరక్షణ చర్యలు, వర్షపాతం నమోదు కారణంగా భూగర్భ జలాలు ఈ ఏడాది 983.30 టీఎంసీలకు పెరిగినట్లు సీజీడబ్లు్యబీ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 934.21 టీసీఎంసీల వరకు వాడుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు 264.18 టీఎంసీలు అంటే 28.3శాతం మాత్రమే వాడుకున్నారని అధ్యయన సంస్థ తెలిపింది. భూగర్భ జలాలను పరిరక్షించుకోవడమే కాకుండా పొదుపుగా వాడుకోవడంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా ఉన్నట్లు సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. భూగర్భ జలాల పరిరక్షణలో గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది కూడా అగ్రస్థానంలోనే ఉందని అధ్యయన సంస్థ తెలిపింది. దేశంలో 2నుంచి 5మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌ (ఉత్తర ప్రాంతం), బీహార్‌ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. భూగర్భజల మట్టం దారుణంగా (20–40 మీటర్ల మధ్య) పడిపోయిన ఢిల్లీ, హరిపయాణ, పంజాబ్, రాజస్థాన్‌లు ఉన్నాయి.
ఏపీ పశ్చిమ ప్రాంతంలో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. కనీసం వెయ్యి అడుగులలోతు బోరు వేస్తే కానీ తాగునీరు, సాగు నీరు బయటకు రాని పరిస్థితి ఉంది. ఈ అధ్యయనం అటువైపుగా సాగలేదని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.



Next Story