ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌కు మరో సారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీంతో తక్షణమే రైతులు అప్రమత్తం కావాలని, వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ సూచించింది. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ మొదలైంది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి నష్టం జరుక్కుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సిసోడియా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందనే అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంఆ మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీని ఫలితంగా ఈ నెల 24 నుంచి తమిళనాడు, కేరళలో విస్తారంఆ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సిసోడియా తెలిపారు.