‘శభాష్ అనిపించుకునేలా పని చేస్తాం’.. పని ప్రారంభించిన మంత్రులు..
x

‘శభాష్ అనిపించుకునేలా పని చేస్తాం’.. పని ప్రారంభించిన మంత్రులు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. శుక్రవారం తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. శుక్రవారం తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు. శాఖలను అందుకున్న ప్రతి మంత్రి కూడా మరుసటి రోజు నుంచే తమ పని స్టార్ట్ చేసేశారు. సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. విధుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష ధోరణి కనిపించినా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు కూడా. సమస్యలు ఉన్నాయంటే వాటిని పరిష్కరించడానికి అధికారులు ముందుండాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని వివరిస్తున్నారు. శాఖల్లో ఉన్న లోటుపాట్ల గురించి కూడా మంత్రులు అడిగి తెలుసుకుంటున్నారు.

యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి: లోకేష్

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తన నివాసంలోనే ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం తన ఇంటి ద్వారా ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాగాన్ని సిద్ధం చేస్తానని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సినీ రంగ అభివృద్ధికి కృషి చేస్తా: దుర్గేష్

సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని జనసేన నేత, మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ‘‘సినిమా రంగంపై ఇకపై ఎటువంటి ఆంక్షలుండవు. సినీ రంగానికి లబ్ది చేకూరుస్తూనే వినోదం అంటే ప్రజలపై భారం పడకుండా చూసుకుంటాం’’ అని వివరించారు. సినిమా షూటింగ్‌లకు డెస్టినేషన్‌ ప్లేస్‌గా ఆంధ్రను తీర్చి దిద్దుతామని, పర్యాటక రంగంలో కూడా ఏపీ ది బెస్ట్ అనేలా మార్చేలా అడుగులు వేస్తామని ఆయన వివరించారు. సినిమాటోగ్రఫీ, వర్యాటకం, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సుభిక్ష పాలన అందించడంపైనే తమ దృష్టి ఉందని, పగలు, ప్రతీకారాలకు తాము పాల్పడమని చెప్పారు. కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తప్పకుండా ఉంటాయని వెల్లడించారు.

శభాష్ అనేలా చేస్తాం: రామానాయుడు

రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్ట్‌లను ఐదేళ్లలో పూర్తి చేసి శభాష్ అనేలా పని చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. కలలుగా ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లు టీడీపీ హయాంలో సాకారమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ‘‘జలవనరుల శాఖను సమర్థవంతంగా నిర్వర్తించడం అంటే రాష్ట్ర ప్రజల రుణం తీసుకోవడానికి అందిన మహత్తర అవకాశం. అలాంటి గొప్ప సేవ చేసుకునే అవకాశాన్ని జగన్ కోల్పోయారు. అంతేకాకుండా చేపట్టిన ప్రాజెక్ట్‌లను నిర్వీర్చం చేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. అవినీతే పరమావధిగా జలనవరుల శాఖను వైసీపీ దుర్వినియోగం చేసింది. ఆవులుపల్లి ప్రాజెక్ట్‌లో పెద్దిరెడ్డి పాపాలు అన్నీ ఇన్నీ కావు. ఆలోచనారహితంగా జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల కృష్ణా జలాల వివాదం తలెత్తింది. పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ ధ్వంసం చేశారు. ఇది మేం చెప్తున్న మాట కాదు.. సాక్షాత్తు నీతి అయోగ్ కమిటీనే దీనిని ధృవీకరించింది. నాకు కేటాయించిన శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story