బడి నుంచి తిరిగి వస్తుండగా.. మరో దళిత బాలికపై అఘాయిత్యం
x

బడి నుంచి తిరిగి వస్తుండగా.. మరో దళిత బాలికపై అఘాయిత్యం

రోజుల వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో మరో దళిత బాలిక అఘాయిత్యానికి గురైంది. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి అనితకు ఈ సమాచారం తెలుసా?


నగరి నియోజకవర్గం వడమాలపేటలో హత్యాచారానికి గురైన నాలుగేళ్ల గిరిజన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, సోమవారం ఆమె తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు.

"మహిళలకు రక్షణ కల్పిస్తాం. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు. జరగకుండా కాపాడుదాం" నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి చురుగ్గా వ్యవహరించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులతో సమీక్ష చెప్తున్నారు. అదేసమయంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై అఘాయిత్యం వెలుగుచూసింది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అనంతపురంలో ఉండగానే, చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారా? ఈ ఘటనపై మాట్లాడకపోవడం వెనుక హోమంత్రి అనిత దృష్టికి ఆ సంఘటన వెళ్లిందా? లేదా? ఓ దళిత విద్యార్థినిపై జరిగిన ఘటనపై ఆమె ఎందుకు స్పందించలేదు? అనే ప్రశ్నలకు సమాధానం వెదికే ముందు.. జరిగిన సంఘటనలో వెళితే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని సోమవారం బడికి వెళ్ళింది. సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి తిరిగి వస్తోంది. పాఠశాల నుంచి ఆమె ఇల్లు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. యథావిధిగాని ఆమె నడిచి వస్తుండగా మార్గమధ్యలో ముసుగులు ధరించిన ఇద్దరు బాలికను అటికాయించారని తెలిసింది.
"అరిస్తే చంపేస్తామని ఆ బాలికను ఇద్దరు యువకులు బెదిరించారు"అని తెలుస్తుంది. అనుకోని ఘటనతో బాలిక స్పృహ తప్పింది. సాయంత్రమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ బాలిక స్థితి జరిగిన దారుణాని తెలుసుకొని గుండెలవిసేలా ఏడ్చినట్లు చెబుతున్నారు. బడి వదిలిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో జరిగిన సంఘటనను ఆ బాలిక ఆ విధంగా తల్లికి వివరించినట్లు సమాచారం. బాలికను ఆసుపత్రికి ఆ తల్లి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే..
ఈ సమాచారం తెలిసిన తర్వాత పీలేరు సీఐ ఇమ్రాన్ బాషా, ఎర్రావారిపాలెం ఎస్ఐ ఎర్రిస్వామి సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించినట్లు తెలిసింది. బడి వదిలాక వస్తూ ఉంటే, మార్గమధ్యలో ఏమి జరిగింది అనే విషయాన్ని బాధిత బాలిక నుంచి సీఐ, ఎస్ఐ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ సంఘటన తెలియడంతో కొందరు వాట్సాప్ గ్రూపులో కొన్ని వివరాలు పోస్ట్ చేశారు. దీనిపై పోలీసులు సీరియస్ గానే స్పందించారు.
" ఈ సంఘటనపై విచారణ జరుసుతున్నాం. విచారణలో అన్నీ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పాల్పడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవు" జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ ఫేస్బుక్ సైట్లో అదే కనిపించింది. బాధిత బాలిక, వారి కుటుంబం గౌరవానికి భంగం కలిగించకూడదు. వివరాలు వెల్లడించడంలో గోప్యత పాటించాలి. అందులో సందేహం లేదు.
జిల్లా పోలీస్ విభాగంలో మీడియాకు సమాచారం అందించే వ్యవస్థ లేకపోవడం కూడా ఒక లోపం అనే విషయాన్ని అధికారులు గమనించడం లేదు. జరిగిన సంఘటనపై వివరణ కోరేందుకు కూడా భాకరాపేట రూరల్ సీఐ ఇమ్రాన్ బాషా, ఎస్సై ఎర్రిస్వామితో మాట్లాడేందుకు "ఫెడర్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధి ఫోన్ కాల్ చేసినా, అందుబాటులోకి రాలేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన ఇదే పరిస్థితి.
ఇలా ఉంటే..
తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలింపు
లైంగిక దాడికి గురైన 9వ తరగతి దళిత విద్యార్థినిని వైద్య కోసం తిరుపతిలోని మెటర్నిటీ మంగళవారం తరలించారు. ఆ బాలిక పరిస్థితి ఏంటి? అనేది కూడా తెలియని వాతావరణం. ఈ సంఘటనపై ఎప్పుడు కేసు నమోదు చేశారనేది కూడా పోలీసుల నుంచి తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆసుపత్రి వద్దకు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలను రానివ్వకుండా పోలీసులను రంగంలోకి దించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలింతలు, గర్భిణుల సంబంధీకులకు కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి.
విద్యార్థుల ధర్నా

బాధిత దళిత విద్యార్థినికి న్యాయం చేస్తూ, దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. లైంగిక దాడికి గురైన దళిత విద్యార్థిని ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు, పరామర్శకు వెళ్లిన తమను అడ్డుకున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు."వందరోజుల పండుగలు కాదు రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కల్పించండి" అని హోం మంత్రి వంగలపూడి అనితను ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రోజుల వ్యవధిలోనే ఈ సంఘటన జరగడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్కు తరలించారు.


మహిళలకు భద్రత కరువు: ycp
రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు భద్రత కరువైందని వైసీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దాడికి గురైన దళిత బాలికను పరామర్శించడానికి వెళితే పోలీసులు లోపలికి అనుమతించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసిన వ్యాఖ్యలు వాస్తవం" అని తాజా సంఘటనతో మరోసారి రుజువైందని భూమన కరుణాకరరెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు చిన్నారులపై గంజాయి , మద్యంమత్తులో రోజుకో అగాయత్యం వెలుగు చూస్తోంది. "ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలు" అని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

దాడిమాత్రమే జరిగింది..

పదో తరగతి బాలికపై దాడి మాత్రమే జరిగింది. లైంఘిక దాడి జరగలేదు. అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. "మైనర్ కావడం వల్ల విచారణకు మొదట పీహెచ్సీకి తీసుకుని వెళ్లారు" అని వివరించారు. ఆ బాలికకు నిన్న రాత్రి తిరుపతి మైటర్నిటీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్య పరీక్షల్లో లైంగిక దాడికి కాలేదని వైద్యులు నిర్ధారించారని ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు. బాలికపై దాడికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని స్పష్టం చేశారు.

Read More
Next Story