నిన్న ప్రభుత్వం నియమించింది. ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.


మాజీ ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ అనురాధ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ఎదురుగా బందర్‌ రోడ్డులో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయంలోని చైర్‌పర్సన్‌ చాంబర్‌లో గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి జే ప్రదీప్‌కుమార్‌ ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బోర్డు సభ్యులు, కార్యదర్శి, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె సమీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నియామకాలు, ఇతర అంశాలపై బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2తో పాటు ఇంకా నిర్వహించాల్సిన వివిధ నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపైన ఆమె చర్చించారు. రాష్ట్రంలోని వివిధ ఉద్యోగాల భర్తీ కోరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కొత్త నోటిఫికేషన్‌లు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు వంటి పలు అంశాలపైనా ఆమె చర్చించారు.

Next Story