సీనియర్ సిటిజన్స్‌కు ఆర్టీసీ రాయితీ టికెట్ల విషయంలో ఇక్కట్లు తొలగనున్నాయి. వాటికి చెక్ పెడుతూ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీలో సీనియర్ సిటిజన్స్ రాయితీలపై నెకొన్న గందరగోళానికి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు శుక్రవావరం మార్గదర్శకాలను విడుదల చేసింది. సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఏపీఎస్‌ఆర్‌టీసీలో రాయితీలను పొందొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణిస్తున్న సమయంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు లేక పోతే, ఫోన్‌లోని డిజిటల్ గుర్తింపు కార్డును చూపించినా రాయితీని పొందొచ్చని పేర్కొంది. ఆ మేరకు అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలుకు ఏపీఎస్‌ఆర్‌సీ ఈడీ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు ఎప్పటి నుంచో రాయితీలను అమలు చేస్తోంది. టెకెట్ ధరలో సీనియర్ సిటిజన్స్‌కు 25 శాతం ఇస్తోంది. అయితే ప్రయాణ సయంలో, టిక్కెట్ల జారీ చేసే సందర్భాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. గుర్తింపు కార్డులు చూపించే సందర్భంలో ఆర్టీసి సిబ్బందికి, సీనియర్ సిటిజన్స్‌కు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే 25 శాతం రాయితీ టికెట్లు ఇస్తున్నారు. ఇతర కార్డులను పరిగణలోకి తీసుకోవడం కానీ, వాటి ఆధారంగా రాయితీ ఇవ్వడం కానీ చేయడం లేదు. దీంతో ఏపీఎస్‌ఆర్‌సీ అధికారులకు సీనియర్ సిటిజన్స్ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఆర్టీసి ఉన్నతాధికారులు ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ రాయితీ టికెట్ల జారీ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు, అందులో పాటించాల్సిన నిమయ నిబంధనలను తెలియజేస్తూ మరో సారి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారకు కూడా అన్ని ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు పొందొచ్చని ఏపీఎస్‌ఆర్‌సీ పేర్కొంది.
Next Story