ఆంధ్రా, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్

ఎపిలో ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.


ఆంధ్రా, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్
x
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు

దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిది.

లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.
ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్‌సభ పోలింగ్‌
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.


  • నాలుగో విడత
  • నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25
  • నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 26
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 29
  • పోలింగ్‌ తేదీ: మే 13
  • కౌంటింగ్; జూన్ 4
Next Story