ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు మహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం శాసన సభ, శాసన మండలి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన అంటే ఫిబ్రవరి ఆఖరు శనివారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. సెలవులతో కలుపుకొని మొత్తం 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే దీనిపైన స్పష్టత రావలసి ఉంది. ఎన్ని రోజులు జరపాలనే దానిపై తొలి రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శాఖల వారీగా అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టు మీద అవగాహన చేసుకొని సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.