రెబల్స్‌ అందరిపైనా వేటు వేస్తారా?  కొందరిపైన్నేనా?
x
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం (ఫైల్ ఫోటో)

రెబల్స్‌ అందరిపైనా వేటు వేస్తారా? కొందరిపైన్నేనా?

ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ జరపనున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ జరపనున్నారు. లంచ్‌ సమయానికి ముందు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ విచారించనున్నారు. లంచ్‌ తర్వాత టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను విచారిస్తారు. అయితే స్పీకర్ విచారణకు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు హాజరువుతారా లేదా అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. ఒకవేళ హాజరుకాకుంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.

వైసీపీ వాదన ఏమిటంటే...

నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటోంది ఆ పార్టీ హైకమాండ్. గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేశారు. అనంతరం ఈ నలుగురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ అధిష్ఠానం స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేశారు. అనంతరం ఈ నలుగురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ అధిష్ఠానం స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

ఆరోగ్యం బాగా లేకున్నా రావాల్సిందే...

ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేమని వైసీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఇక ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠగా మారింది.

టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో?

టీడీపీ రెబెల్​ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరిధర్‌కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఇవాళ హాజరుకాలేనని ఫిబ్రవరి 2వ తేదీన హాజరవుతానని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరి స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చుకున్నారు. మరి మిగిలిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ముందు హాజరు అవుతారా లేదో చూడాలి.

ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ జరపనున్నారు. లంచ్‌ సమయానికి ముందు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ విచారించనున్నారు. లంచ్‌ తర్వాత టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను విచారిస్తారు. అయితే స్పీకర్ విచారణకు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు హాజరువుతారా లేదా అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. ఒకవేళ హాజరుకాకుంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.

ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేమని వైసీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఇక ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠగా మారింది.

విదేశీ పర్యటనలో మద్దాల గిరి...

టీడీపీ రెబెల్​ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరిధర్‌కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఇవాళ హాజరుకాలేనని ఫిబ్రవరి 2వ తేదీన హాజరవుతానని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరి స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చుకున్నారు. మరి మిగిలిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ముందు హాజరు అవుతారా లేదో చూడాలి.

Read More
Next Story