ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు పొదుపుగా ఉన్నాయి. సూపర్ సిక్స్ విషయం ఇంతవరకు మాట్లాడలేదు. అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేదు.
సచివాలయం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పని బాబు
రాష్ట్రంలో అభివృద్ధి మార్క్ ఎలా ఉంటుంది?
మద్యం విధానంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తారు?
బాబు సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
సంక్షేమ పథకాల హామీలు ఎంతవరకు అమలవుతాయి?
కేంద్రం ఏపీ అభివృద్ధికి నిధులు ఏ స్థాయిలో ఇస్తుంది?
ప్రత్యేక హోదా అందని ద్రాక్షేనా?
పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది?
రాష్ట్రాభివృద్ధా..? రాజకీయాలా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచీ తూచీ మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తున్నాయి. ఎక్కడా మాట తూలడం లేదు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో పూర్తి స్థాయిలో వివరించడం లేదు. అమరావతి, పోలవరం నా మొదటి ప్రయారీటీలని చెప్పారు. ఏపీ అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం అమరావతి, పోలవరం అని. నిజమే ఈ రెండు ప్రాజెక్టులూ ముఖ్యమైనవే. ఆంధ్ర రాష్ట్రనాకి ఎంతో అవసరమైనవే. వీటిని పూర్తి చేయాలంటే తప్పకుండా కేంద్ర నుంచి నిధులు తెప్పించుకోవాలి. కేంద్రం ప్రభుత్వం జుట్టు ప్రస్తుతం చంద్రబాబునాయుడు చేతుల్లో ఉంది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అప్పటి ప్రధాన మంత్రి దామోదర్ నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీల ద్వారా నిధులు ఇస్తామని నమ్మబలికారు. అప్పట్లో కూడా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామి. ఒక ఏడాదికి ప్రభుత్వం గడువు ముగుస్తుందనగా నాడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్‌డీఏను వీడారు. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామా చేశారు. అయితే అప్పట్లో కేంద్రానికి ఏ పార్టీ మద్దతు లేకుండానే బిజెపీకి ప్రభుత్వాన్ని నడిపించే పార్లమెంట్ సీట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబు ఉన్నా, లేకున్నా సమస్య లేదని భావించిన మోదీ పట్టించుకోలేదు. నిజానికి ఆరోజే టాక్టీస్‌గా వ్యవహరించి ఉంటే రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు వచ్చి నిర్మాణాలు పూర్తయ్యేవి. ప్రభుత్వం మారుతుందని చంద్రబాబు ఊహించలేదు. రాజధాని నిర్మాణం విషయంలో ఎన్నో చర్యలు తీసుకున్నానని, ఎంతగానో ప్రజలను ఆదరిస్తున్నానని అనుకున్నారు. కానీ చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు.
వైఎస్సార్‌సీపీ అధికారం చేపడితే ఎలా ఉంటుందో తెలుసుకుందామని జగన్ పార్టీకి ఏపీ ఓటర్లు ఓటు వేశారు. వైఎస్సార్‌సీకి 152 సీట్లు ఇచ్చి పూర్తి స్థాయి మెజారిటీతో గెలిపించారు. ఐదేళ్లపాటు జగన్ పాలన చూశారు. ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను మ్యాచింగ్ గ్రాంట్ కింద తీసుకోవడం కూడా జగన్‌కు చేతకాలేదు. రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీలకు కొన్ని సబ్సిడీ పథకాలు ఉంటాయి. వాటిని కూడా జగన్ మరిచిపోయారు. కేంద్ర కార్పొరేషన్‌ల నుంచి సబ్సిడీ ద్వారా ఇచ్చే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు గురించి పట్టించుకోలేదు.
పైగా ఏ పార్టీ అయినా పంచాయతీల్లో వీరాభిమానులు, పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసే కార్యకర్తలపై ఆధారపడి ఉంటుంది. వారి బాగోగుల గురించి కూడా పట్టించుకోలేదు. డీబీటీ ద్వారా పేదలకు డబ్బులు పంచాము, కాబట్టి ఓటు వేస్తారనుకోకవడం తప్పు. అభివృద్ధి లేకుండా కేవలం డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటే సరిపోదని ఓటర్లు తీర్పు ఇచ్చారు.
ఇవన్నీ చంద్రబాబుకు తెలియవా? అందుకే ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అమరాతిలో పర్యటించారు. మొదటి సారి తాత్కాలిక సచివాలయానికి వెళుతున్నప్పుడు చుట్టప్కల గ్రామాల నుంచి చంద్రబాబుకు ఘన స్వాగతం లభిచింది. పూలు చల్లి పూలపై కారును సచివాలయం వరకు నడిపించారు. ఇది ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. పైగా అమరాతి పరిధిలోని కృష్ణా, గుంటూరు పూర్వపు జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైఎస్సార్‌సీపీకి ఇ్వలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే చంద్రబాబు మాటలు పొదుపుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడాలో అవే మాట్లాడుతున్నారు. రెండేళ్లలో అమరాతి పూర్తి చేస్తామని అర్బన్ డెవలప్ మెంట్ మినిస్టర్ నారాయణ చెప్పినా చంద్రబాబు మాత్రం ఆ మాట కూడా చెప్పలేదు.
తాను ప్రధాన మంత్రి ద్వారా శంకుస్థాపన చేసిన అమరావతి సచివాలయ నిర్మాణం చెదలు పట్టిన మట్టితో పనికి రాకుండా పోయిందనే ఆవేదన చెందుతూ మోకాళ్లపై మోకరిల్లి అమరావతి సచివాలయ నిర్మాణ ప్రదేశంలో తలను నేలకు ఆనించి నిట్టూర్చారు. తన మనో వేదనను అందరి ముందు అక్కడ వెలుబుచ్చారు. మోదీ వేసిన పునాది రాయిని తదేకంగా చూస్తూ బాధపడ్డారు. ఇన్ని జరిగినా అమరావతిని ఎప్పటి లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారో వెల్లడించలేదు. దటీజ్ చంద్రబాబు అంటున్నారు పలువురు. చేయగలిగింది చేస్తానంటారు. లేదంటే పలువురిని ఒప్పించి ఆ పనులు ముందకు తీసుకు వెళతారు. అదీ చంద్రబాబు గొప్పతనమని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
ఏపీకి ప్రత్యేక హోదానే శరణ్యమని ఇంతవరకు అనలేదు. అభివృద్ధికి నిధులు ఎలా తెస్తారో చెప్పలేదు. మద్యం విధానంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారో వివరించలేదు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయో వివరించలేదు. కేవలం రాజకీయాలా? దాంతో పాటు అబివృద్ధి కూడానా అనేదానిపై స్పష్టమైన విధానం ప్రకటించలేదు. ఆబ్కారీ విధానాన్ని ఎలా ముందుకు తీసుకు పోతారో చెప్పలేదు. మద్యం ప్రియులు అనేక మంది కొత్త మందు మార్కెట్లోకి ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు. టెండర్లు వేసి మద్యం అమ్మకాలు ప్రైవేట్ వారికి అప్పగిస్తారా? ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తుందా? అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
Next Story