చంద్రబాబును కలిసిన బెల్జియం బృందం
x

చంద్రబాబును కలిసిన బెల్జియం బృందం

ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి పెట్టబడిదారులను అమరావతికి ఆహ్వానించిన చంద్రబాబు తన పిలుపు అంర్జాతీయ స్థాయికి చేర్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి పెట్టబడిదారులను అమరావతికి ఆహ్వానించిన చంద్రబాబు తన పిలుపు అంర్జాతీయ స్థాయికి చేర్చారు. ఈ నేపథ్యంలో బెల్జియం రాయబారి నేతృత్వంలో పెట్టుబడిదారుల బృందం ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబును మర్యాదక పూర్వకంగా కూడా కలిసిందా బృందం. ఈ సందర్భంగా బెల్జియం రాయబారి దిదీర్ వాండెర్ హాసెల్ట్‌ను శాలువా కప్పి సత్కరించారు చంద్రబాబు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామని నారా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన బృందంలో బెల్జియంకు చెందిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "బెల్జియం రాయబారి వాండెర్ హాసెల్ట్ నాయకత్వంలో వచ్చిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యాను. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నాం" అని సీఎం చంద్రబాబు తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

Read More
Next Story