ఆంధ్రప్రదేశ్ లో ఏయే జిల్లాలకు ఏయే మంత్రి ఇన్ చార్జ్ అంటే..
x

ఆంధ్రప్రదేశ్ లో ఏయే జిల్లాలకు ఏయే మంత్రి ఇన్ చార్జ్ అంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. రెండు జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులుగా ఉన్న వారిలో అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం- వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు
విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి- కొల్లు రవీంద్ర
కాకినాడ- పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్‌
పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్‌- సత్యకుమార్ యాదవ్‌
కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌
గుంటూరు- కందుల దుర్గేష్‌
బాపట్ల- కొలుసు పార్థసారథి
ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు- ఎన్‌ఎండీ ఫరూక్‌
నంద్యాల- పయ్యావుల కేశవ్‌
అనంతపురం- టీజీ భరత్‌
శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్‌
వైఎస్‌ఆర్‌- ఎస్‌.సవిత
అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి
చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
వీరు ఆయా జిల్లాల అభివృద్ధి వివరాలను సమీక్షిస్తారు. జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.


Read More
Next Story