ఆకాశంలో ఐదు అద్భుతాలు- చంద్రబాబు ఖాతాలో 5 గిన్నిస్ రికార్డులు
x

ఆకాశంలో ఐదు అద్భుతాలు- చంద్రబాబు ఖాతాలో 5 గిన్నిస్ రికార్డులు

విజయవాడ పున్నమి ఘాట్‌ డ్రోన్ల ప్రదర్శనతో పులకించింది. వేలాది డ్రోన్లు చేస్తున్న విన్యాసాలు లక్షలాది మందిని అలరించాయి.


విజయవాడ పున్నమి ఘాట్‌ డ్రోన్ల ప్రదర్శనతో పులకించింది. వేలాది డ్రోన్లు చేస్తున్న విన్యాసాలు లక్షలాది మందిని అలరించాయి. ఈ జాతీయ ప్రదర్శన, డ్రోన్‌ సదస్సు ఏకంగా ఐదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని నెలకొల్పింది. అమరావతి పేరిట నిర్వహించిన అద్భుత ప్రదర్శన అందులో ఒకటిగా నిలిచింది.

ఏమిటీ ఐదు ప్రదర్శనలంటే...

అతిపెద్ద ప్లానెట్ ఫార్మేషన్.. ఇందులో సుమారు ఐదు వేల డ్రోన్లు పాల్గొన్నాయి. రెండోది అతిపెద్ద ల్యాండ్‌మార్క్ క్రియేషన్, మూడోది లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, నాలుగోది లార్జెస్ట్ ఫ్లాగ్ డిస్‌ప్లే, ఐదోది ఏరియల్ లోగో డిస్‌ప్లే. ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైలురాయిగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్కంచూపఠభరితమైన ప్రదర్శనలో 5,500 డ్రోన్‌ను ఉపయోగించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రదర్శన. ఈ డ్రోన్ల షోను చూసేందుకు విజయవాడ ప్రజలు తరలివచ్చారు.

సందర్శకులతో పున్నమి ఘాట్ పులకించింది. సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు చూపరులు నానా తంటాలు పడ్డారు. సమీపంలో ఎక్కడ ఏది ఎత్తుగా కనిపిస్తే అక్కడికల్లా ఎగబాకుతూ సెల్ ఫోన్లతో వీరంగం సృష్టించారు. చూపరుల కోసం విజయవాడ నగరంలో ఐదు చోట్ల ఎల్ఇడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ ప్రదర్శనతో పాటు, హాజరైన వారికి అబ్బురపరిచే లేజర్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరై ఈ అపూర్వ విజయాలను రికార్డ్ చేసినట్టు సర్టిఫికెట్లు అందజేశారు. సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్ర మద్దతును ప్రదర్శిస్తూ డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కులను ప్రదానం చేశారు.

దేశంలో ముందెన్నడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఆకాశ తీరాన డ్రోన్లు సయ్యాటలాడాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ.. ఇలా ఏ నృత్యరీతులను ఆA డ్రోన్లు ఔపోసన పట్టాయో తెలియదు కానీ ఆ సాంకేతిక పద విన్యాసాలలో కళ్లుమూసి తెరిచేలోపు అద్భుతం మిరుమిట్లు గొలుపుతూ వీక్షకులను కట్టిపడేశాయి. గిన్నిస్‌ రికార్డులన్నీ కట్టగట్టుకుని వచ్చి వాలాయి. డ్రోన్ అంటే పెళ్లి ఫొటోలు చిత్రీకరించే చిన్న పరికరం కాదు సుమా! అనేలా చేశాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన డ్రోన్లు రాజకీయ పార్టీల మహాసభలను, ర్యాలీలను, ఇతరత్రా వేడుకలను, పొలాల్లో పురుగు మందులు చల్లడానికి మాత్రమే వినియోగించడాన్ని చూశాం. ఇకపై దేనికైనా ఈ డ్రోన్లను వాడవచ్చునని ఈ ప్రదర్శన నిరూపించింది.


Read More
Next Story