ఆంధ్రలో దూకుడు పెంచిన పార్టీలు.. ప్రచారాలు ఈరోజు ఇలా..
x

ఆంధ్రలో దూకుడు పెంచిన పార్టీలు.. ప్రచారాలు ఈరోజు ఇలా..

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి పార్టీ రోజుకు రెండు మూడు సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు ఈ ప్రచారాలు ఎక్కడెక్కడ సాగనున్నాయంటే.


ఆంధ్రలో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాల జోరును పెంచారు. మునుపటికంటే మరింత దూకుడుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తూ తమ పార్టీని, పార్టీ జెండాను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తెగ ప్రయాస పడుతున్నారు. గతంలోనే వెళ్లాయి కదా అంటే.. ఇప్పుడు ఎన్నికలు బాస్ మరోసారి గుర్తు చేస్తే పోయేదేముంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా తాము అధికారంలోకి ప్రజలకు ఏం చేస్తామో చెప్తూ అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల వైసీపీ అధినేత, సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా తమ మేనిఫెస్టోను కట్టుదిట్టంగా సిద్ధం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కూటమి కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఒకవైపు మేనిఫెస్టోపై కసరత్తులు చేస్తూనే కూటమి పార్టీలు తమ ప్రచారాలను కూడా కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేసేస్తున్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రధాన పార్టీల ప్రచార షెడ్యూల్స్ ఎలా ఉన్నాయంటే..

సీఎం జగన్.. ఏప్రిల్ 28 నుంచి మూడో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఏప్రిల్ 29న కూడా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు అమలాపురం పార్లమెంటు పరిధిలోని అంబాజీపేట బస్టాండ్ రోడ్‌లో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు పార్టమెంటు పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే ఈ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.

జనసేనాని పవన్ కల్యాణ్.. ఈరోజు తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ చందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది. వన్నెపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బీ కొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నరసింహపురం, ఎల్ఎన్ పురా, కోలంక, విరవాడ, వీరవ, మంగితుర్తి, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కండరాడ, కమారపురం వరకూ సాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఈరోజు కాకినాడ, పోలవరం, రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు కాకినాడ పట్టణంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం, కొయ్యాలగూడెంలో బహిరంగ సభ నిర్వహించి అందులో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రిలో రోడ్‌షోతో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు.

Read More
Next Story