ఎన్నికల ప్రచారాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..
x

ఎన్నికల ప్రచారాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు మరింత జోరందుకోనున్నాయి. ప్రతి పార్టీ కూడా తమ ప్రచారాల స్పీడు పెంచడానికి కసరత్తులు చేస్తున్నాయి.



ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగింసింది. దీంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు చేయడానికి రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త పర్యటన కొనసాగిస్తున్న పార్టీలు తమ ప్రచారాల జోరును మరింత పెంచడానికి కసరత్తులు చేస్తున్నాయి. ప్రత్యేక సభలు, నేతలతో సమావేశాలతో పార్టీ అధినేతలంతా ఫుల్ బిజీ కానున్నారు. వారి ప్రచారాలు ఇలా సాగనున్నాయి.


ఈ నేపథ్యంలోనే నిన్న నామినేషన్ వేసిన సీఎం జగన్ కూడా తన రాష్ట్రవ్యాప్త ప్రచారానికి ఫుల్ రూట్ మ్యాప్ రెడీ చేసేసుకున్నారు. ఇన్నిరోజులు ‘సిద్ధం’ సభలు, ‘మేమంతా సిద్ధం’ యాత్రతో ప్రచారాన్ని పరుగులు పెట్టించిన జగన్.. మరోసారి రాష్ట్రాన్ని కలియతిరగడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజుల విశ్రాంతి తర్వాత ఏప్రిల్ 28 నుంచి తన రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఆయన ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. తమ పార్టీ గుర్తునూ, అభ్యర్థిని, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడే ఈ ప్రచార ప్రధాన లక్ష్యంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


అదే విధంగా ఏపీసీసీ వైఎస్ షర్మిల ఈరోజు కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆమె తిరువూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు చింతపూడిలో, రాత్రి 7 గంటలకు దెందులూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.



Read More
Next Story