ఒకరు ఇన్.. ఇంకొకరు అవుట్
x

ఒకరు ఇన్.. ఇంకొకరు అవుట్

ఎన్నికల ముంగిట ఆంధ్రలో అధికారుల బదిలీలో ఎక్కువవుతున్నాయి. అధిక ఫిర్యాదులు వస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటుంది.


ఆంధ్రలో ఎన్నికల డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారుల విషయంలో ఈసీ కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే అక్కడి అధికారులపై బదిలీ వేటు వేస్తోంది. వారు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులైనా డోంట్ కేర్ అన్నట్లు ఈసీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్నే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను నియమించింది ఎన్నికల సంఘం. అంతేకాకుండా వెంటనే బాధ్యతలు స్వీకరించాలని గుప్తాను ఆదేశించింది. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన నియామకాన్ని ఫైన్ చేసిన ఎన్నికల సంఘం ఈరోజు మరో డీఐజీపై బదిలీ వేటు వేసింది.

డీఐజీ బదిలీ

ఎన్నికల నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం ఇప్పటికే బదిలీ వేటు వేసింది. తాజాగా ఆ జాబితాలోకి డీఐజీ అమ్మిరెడ్డి పేరు కూడా చేరింది. ఆయనను తక్షణమే విదుల నుంచి తొలగించాలని, ఆయనకు ఏవిధమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డి.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారిన ప్రతిపక్ష నేతలు చేసిన ఫిర్యాదుల క్రమంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

దీంతో ఎన్నికల ముంగిట రాష్ట్రంలో బదిలీల పర్వం జోరందుకుంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తోంది. వారి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని, అందుకు తగిన ముగ్గురు అధికారుల పేర్లను తమకు అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా పారదర్శకమైన ఎన్నికల కోసమేనని ఈసీ చెప్తోంది.

Read More
Next Story