ఏపీలో తొలి విడత నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ.. ఎవరికి ఏ పోస్ట్ అంటే..
x

ఏపీలో తొలి విడత నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ.. ఎవరికి ఏ పోస్ట్ అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్ట్‌ల విషయంలో హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా ఈ టెన్షన్‌కు ఏపీ సర్కార్ తెరదించింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, సభ్యల నియామకం పూర్తయినట్లు ప్రకటించింది.


ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్ట్‌ల విషయంలో హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా ఈ టెన్షన్‌కు ఏపీ సర్కార్ తెరదించింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, సభ్యల నియామకం పూర్తయినట్లు ప్రకటించింది. ఈ నియామకాల్లో కూటమి పార్టీల నేతలకు ప్రాధాన్యత లభించింది. కొందరికి నిరాశే ఎదురైనా.. చాలా వరకు ఆశించిన వారికి పదవులు దక్కాయి. వీరిలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించింది. అదే విధంగా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా అబ్దుల అజీజ్ నియమితులయ్యారు. ఈ మేరకు మొత్తం నియమకమైన 99 మంది జాబితాను విడుదల చేసింది. నామినేటెడ్ పోస్ట్ భర్తీ విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ఈ నియామకాల ప్రక్రియ సామాన్య కార్యకర్లను సీఎం పెద్దపీట వేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి, కష్టకాలంలో కూడా భుజాన జెండా మోసిన వారికి ప్రాధాన్య లభించింది. అటువంటి వారికే 11 కస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, ఆరు యూనిట్ ఇన్‌ఛార్జ్‌ల పదవులు దక్కాయి. ఇప్పటికే క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఒకరికి ఛైర్మన్ పదవి దక్కింది.

కార్పొరేషన్ ఛైర్మన్లు, సభ్యుల వివరాలివే..

• వ్బర్డు- అబ్దుల్ అజీజ్ (టీడీపీ)

• శాప్- అనిమిని రవి నాయుడు (టీడీపీ)

• గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ)

• ఏపీ ట్రైకార్- బొరగం శ్రీనివాసులు (టీడీపీ)

• ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ)

• సీడాప్- దీపన్రెడ్డి (టీడీపీ)

• 20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్ (బీజేపీ)

• మార్క్ ఫెడ్- కర్రోతు బంగార్రాజు (టీడీపీ)

• సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)

• ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ)

• పద్మశాలి కార్పొరేషన్- నందం అబద్దయ్య (టీడీపీ)

• ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ)

• ఏపీఎస్ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ)

• పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)

• లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)

• వినియోగదారుల రక్షణ కౌన్సిల్- పీతల సుజాత (టీడీపీ)

• ఎంఎస్ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

• పౌరసరఫరాల కార్పొరేషన్- తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)

• ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)

• ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్కుమార్ (జనసేన)



Read More
Next Story