నూతన మద్యం పాలసీకి కసరత్తులు.. అప్పటి నుంచి అమలు..
x

నూతన మద్యం పాలసీకి కసరత్తులు.. అప్పటి నుంచి అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చే విధంగా కూటమి సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం పాలసీ విధానాలను అధ్యయనం చేయనుంది.


ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చే విధంగా కూటమి సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం పాలసీ విధానాలను అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనాలు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మద్యం పాలసీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించిన తర్వాత ఈ బృందాలు తమ నివేదికలను అందించనున్నాయి. ఈ నెల 12లోపు అన్ని బృందాలు తమ నివేదికలు అందిస్తాయి. మరోవైపు కొత్త మద్యం విధానం ఎలా ఉండాలి అన్న అంశంపై ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా మరో అధ్యయనం జరగనుంది. ఈ నివేదికలన్నింటిపై మంత్రివర్గం సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. ఈ చర్చల తర్వాత కొత్త మద్యం విధానాన్ని సిద్ధం చేయనున్నారు.

అక్టోబర్‌లో అమలు

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలలోనే నూతన మద్య విధానాన్ని సిద్ధం చేసి.. దానిని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిశ్చయించారు. ‘‘ఆదాయం కోణంలో కాకుండా ఎక్కడా అవకతవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానాన్ని సిద్ధం చేయాలి. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలను అధ్యయనం చేయాలి. లోసుగులు, లోటుపాటులు ఉండని మద్యం విధానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని అధికారులను ఆదేశించారు చంద్రబాబు.

నాణ్యతలో రాజీ లేదు

‘‘గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. నాణ్యత అన్న అంశాన్నే మరిచి తయారు చేసిన మద్యాన్ని ప్రజలకు అందించి వారి ప్రాణాలకే ముప్పు వచ్చేలా చేసింది. అలాంటి నాణ్యతలేని, కల్తీ మద్యం మళ్ళీ రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. మద్యం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుంది. దీంతో మద్యం కోనలేక అనేక మంది గంజాయి, నాటుసారా, కల్తీ మద్యానికి అలవాటు పడ్డారు. ఆరోగ్యాల్ని నాశనం చేసుకున్నారు. ప్రతిఒక్కరికీ నాణ్యమైన మద్యం అందుబాటు ధరలకే లభించేలా నూతన విధానం ఉండాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

వ్యసన విముక్తికి ప్రత్యేక విధానం

అదే విధంగా మద్యానికి బానిసలైపోయిన వారిని వ్యసనపరులను విముక్తులను చేయడానికి, వారి పునరావాసానికి వీలుగా కూడా ప్రత్యేక విధానం తీసుకురావాలని కూడా సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. ‘‘వ్యసన విముక్తులను చేయడానికి కూడా ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అక్టోబర్ 2 కల్లా విధానాన్ని అమలు చేయాలని. నాటుసారా, కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక క్యాంపెయిన్‌ రన్ చేయాలి. పొరుగు రాష్్టరాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి’’ అని వెల్లడించారు.

Read More
Next Story