వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
x

వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

జర్నలిస్ట్‌ల హెల్త్ స్కీమ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారు.


జర్లలిస్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్కింగ్ జర్నలిస్ట్‌లను అందిస్తున్న హెల్త్ స్కీం పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా పొండించనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ఈ మేరకు జీఓ ఎంఎస్ 82ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ స్కీం పొడిగింపు కోసం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందు కోసం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిందని శుక్లా వివరించారు.

పరిమితులు లేని సదుపాయం

ఈ స్కీమ్ ద్వారా జర్నలిస్టులతో పాటు వారి కుటంబీకులకు కూడా ఏదైనా ప్రమాదం జరినిగా, ఊహించని అస్వస్థత వచ్చినా వారికి రూ.2లక్షలు విలువైన వైద్యం ఉచితంగా అందించబడుతుంది. ఏడాదిలో ఎన్నిసార్లైనా ఈ సదుపాయాన్ని జర్నలిస్ట్‌లు వినియోగించుకోవచ్చు. వారికి ఈ హెల్త్ స్కీమ్ విషయంల అపరిమిత సేవలు అందుతాయి. అంతేకాకుండా ఈ స్కీమ్ విషయంలో ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు. నిర్దేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు కూడా పొందవచ్చు అని శుక్లా తెలిపారు.

ఈ పథకానికి డా. నందమూరి తారకరామారావు వైద్య సేవ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని డైరెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆనందంలో జర్నలిస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంపై విలేకరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భద్రతలేకుండా పోతున్న జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడమే కాకుండా జర్నలిస్టు కుటుంబాలకు కూడా ఆరోగ్య భద్రతను అందించడం చాలా సంతోషకరమైన అంశమని పలువురు జర్నలిస్ట్‌లు చెప్తున్నారు.

Read More
Next Story