ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ బిల్లులు ఎన్ని కోట్లంటే..
x

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ బిల్లులు ఎన్ని కోట్లంటే..

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ కుధేలైందంటూ అసెంబ్లీ నాలుగోరోజు సమావేశాల్లో జరిగిన చర్చల్లో కూటమి నేతలు వివరించారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల.


గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ కుధేలైందంటూ అసెంబ్లీ నాలుగోరోజు సమావేశాల్లో జరిగిన చర్చల్లో కూటమి నేతలు వివరించారు. సంక్షేమం అందిస్తున్నామంటూ కబుర్లు చెప్పి అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారంటూ విసుర్లు విసిరారు కూటమి నేతలు. అందుకు 2019-24 మధ్య ఉన్న పెండింగ్ బిల్లులే నిదర్శనమని తెలిపింది ప్రభుత్వం. సంక్షేమాలు అందిస్తున్నామని చెప్పి ప్రజల నెత్తిన భారీ మొత్తంలో అప్పుల భారాన్ని మోపారని విమర్శించారు. ఈ పెండింగ్ బిల్లులన్నింటిపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 2019-2024 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ ఉన్నట్లు సర్కార్ గుర్తించింది.

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జరిగిన అవకతవకలపై త్వరలోనే సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రూ. వేల కోట్లు ఉన్నాయని సర్కార్ తేల్చింది. అంతేకాకుండా ఈ పెండింగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లను సీఎఫ్ఎంఎస్‌లోకి అప్‌లోడ్ కూడా చేయలేదని ప్రభుత్వం వివరించింది. దీనిపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ప్రజలు ముందుంచుతామని తెలిపింది. వాటి కారణంగానే రాష్ట్ర ఖాజానా అడుగంటి పోయిందని, అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా పనులను నిర్వర్తిస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు.

వేల కోట్ల చెల్లించలేదు

పెండింగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లను అప్‌లోడ్ చేయలేదు. అప్‌లోడ్ చేసిన పెండింగ్ బిల్లుల్లో రూ.48వేల కోట్లు చెల్లింపులు కూడా చేయలేదని తమకు తెలిసిందని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వం అన్ని శాఖల్లో అవకతవకలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి పారుదల శాఖ, పోలవరం బిల్లులు కూడా భారీగానే పెండింగ్‌లోనే ఉన్నట్లు చెప్పింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో విడుదల చేసే శ్వేతపత్రంలో వెల్లడిస్తామని తెలిపింది.

శ్వేతపత్రంలో ఉండే వివరాలు..

వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రూ.14,324 కోట్ల మేర బకాయిలు

ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్ల పెండింగ్ బిల్లులు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకు పైగా ఉన్న బకాయిలు

మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్ల బకాయిలు

వీటితో పాటు మరికొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను శ్వేతపత్రంలో వివరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More
Next Story