డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబుపైన సెటైర్‌ వేశారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరిలో కంటే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణే సమర్థవంతమైన నాయకుడని, ఏపీకి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు పవన్‌కే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్‌కు సరైన గుర్తింపు, గౌరవం దక్కాలన్నా పవన్‌ కల్యాణ్‌ సీఎం అయితేనే సాధ్యం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒక యంగ్‌ రాష్ట్రమని, దీనికి ప్రస్తుతం 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహిస్తున్నాడని, దీని వల్ల ఏపీకి పెద్ద ఉపయోగం ఉండదని, ఆయన నటించడం తప్ప ఇంకేమీ చేయలేరని అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ఇది ఇప్పుడు కూటమి వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తడంతో ఒకింత ఆనందానికి గురవుతూ.. ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

Next Story