అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి..
x

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి..

విద్య కోసమో, ఉపాధి కోసమో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్న తెలుగు వారి సంఖ్య రోజురోజుకు అధికం అవుతోంది. అదే విధంగా అగ్రరాజ్యంలోనే అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది.


విద్య కోసమో, ఉపాధి కోసమో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్న తెలుగు వారి సంఖ్య రోజురోజుకు అధికం అవుతోంది. అదే విధంగా అగ్రరాజ్యంలోనే అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. తాజాగా బుచ్చిబాబు(40) అనే తెలుగు వ్యక్తి ప్రమాదవ శాత్తు తన ప్రాణాలు కోల్పోయారు. అతడి మరణ వార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. విదేశాలకు వెళ్లి ఏదో సాధించాలన్న తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయాడంటూ వారు వాపోతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అధికారులు సహాయం చేయాలని కోరుతున్నారు.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోనే పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే సెటిల్ కూడా అయ్యారు. ఈ వీకెండ్‌కు ఫ్యామిలీతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు ఆయన నీట మునిగి మరణించారు. అతడి ముత్రదేశాన్ని పోలీసులు వెలికి తీశారు. అతడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అతడి మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు సమాచారన్ని అతని మరణానికి సంబంధించిన వివరాలను కుటుంబీకులకు చేరవేసినట్లు అధికారులు చెప్పారు.

బుచ్చిబాబు మరణవార్తతో ముండ్లమూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవచూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read More
Next Story