ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్స్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తిరుపతికి తీసుకొని రానున్నారు.


అక్రమంగా తరలించుకొని పోతున్న ఎర్రచందనాన్ని ఏపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పాటు నిందితులను తిరుపతికి తీసుకొని రానున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ మార్కెట్‌లో రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలువరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌ సాండర్స్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్‌) యూనిట్, డీఎస్పీ షరీఫ్‌ నేతృత్వంలో గుజరాత్‌ రాష్ట్రంలోని పటాన్‌ జిల్లా చేరుకుంది. అక్కడి స్థానిక పోలీస్‌ సిబ్బంది సహకారంతో, మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఉత్తమ్‌ కుమార్‌ నందకిషోర్‌ సోనీ, జోషీ హన్స్‌ రాజ్, ఠాకూర్‌ పరేశ్‌జీలు గుజరాత్‌ రాష్ట్రానికి చెందినవారు.

అరెస్ట్‌ ప్రక్రియ పూర్తి చేసి, వారి వద్ద నుండి 155 రెడ్‌ సాండర్స్‌ దుంగలు (సుమారు 5 టన్నులు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 కోట్లు (అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 10 కోట్లు), ఒక టయోటా బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం స్థానిక మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు. వారెంట్‌ పొందిన తర్వాత, స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు నిందితులను తిరుపతికి తరలించి, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
Next Story