అమరావతిలో ఎన్ డిఎ సర్కార్ నిర్మిస్తున్న సచివాలయం పార్లమెంటు భవనం కంటే ఖరీదైన నిర్మాణం, ఇది విదేశీ పెట్టుబడులు తెస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అత్యంత ఖరీదైన సెక్రెటేరియట్ సముదాయం వస్తున్నది. ప్రపంచంలోనే ఇంత ఖరీదైన ప్రభుత్వం భవన సముదాయం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. దాని నిర్మాణం ఖర్చు కొత్త పార్లమెంటు భవనం కంటే చాలా ఎక్కువ. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రేటేరియట్ వ్యయం కంటే ఎనిమిదింతలు ఎక్కువ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచంలో ఏ ప్రావిన్స్ కి లేనంత రీతిలో సెక్రెటేరియట్ నిర్మాణం చేస్తున్నారు. దాని క్వాలిటీ ఖర్చు తగ్గట్టుగా ఉంటుందో లేదో ఇపుడే చెప్పలేం కాని ఖర్చు లో మొత్తం నెంబర్ వన్.
చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న సెక్రెటేరియట్ టవర్లకు రు. 4687 కోట్లు ఖర్చువుతాయన అంచనా. ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్ల మెంటుకు ఖర్చయింది రు. 971 కోట్లు. ఈ పార్లమెంటు నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. 2023 మే 28న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక తెలంగాణలో ఇటీవల నిర్మించిన సెక్రెటేరియట్ విషయానికి వస్తే, దేశంలో అంత్యంత ఆధునిక నిర్మాణం ఇదే. ఈ భవనాన్ని 2023 ఏప్రిల్ లో కెసిఆర్ ఆవిష్కరించారు.దీని నిర్మాణానికి అయిన ఖర్చు రు. 616 కోట్లు మాత్రమే.
దీనితో పోలిస్తే, చంద్రబాబు నిర్మిస్తున్ సెక్రెటేరియట్ నిర్మాణ వ్యయం చాలా చాలా ఎక్కువ. ఇది ఇంకా పెరగదన్న గ్యారంటీ లేదు.
ఈ సచివాలయం ఐదు టవర్లతో నిర్మితమవుతోంది. ఇందులో నాలుగు సచివాలయ టవర్లు, ఒకటి హెచ్‌వోడీ (విభాగాధిపతులు) టవర్‌గా ఉంటుంది. దీనికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం ఖర్చు దాదాపు రూ.4,687 కోట్లు. ఇందులో టవర్లు 1, 2 కోసం రూ.1,897 కోట్లు, టవర్లు 3, 4 కోసం రూ.1,664 కోట్లు, హెచ్‌వోడీ టవర్ కు (సీఎం కార్యాలయం ఉండే టవర్) రూ.1,126 కోట్లు ఖర్చు చేస్తారు.
భారీ నిర్మాణాల మీద ఆయనకు ఎంత మోజో...
అమరావతిని ఒక విశ్వ నగరంగా (world-class city) తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. సచివాలయం ఈ విజన్‌కు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర పరిపాలనా కేంద్రం, రాజధాని గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఐకానిక్ భవనాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయనేది ఆయన నమ్మకం. సచివాలయం వంటి గ్లోబల్-స్టాండర్డ్ భవనం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆధునిక, పెట్టుబడి-స్నేహపూర్వక రాష్ట్రంగా చూపించడం బాబు ఆశయం.
అమరావతి ప్రాజెక్ట్ చంద్రబాబు రాజకీయ వారసత్వంలో కీలక భాగం. ఇలాంటి నిర్మాణాలు చేపట్టి వాటిని తన పరిపాలనా పటిమకు తార్కాణంగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకోవాలంటే అప్పు చేసయిన భారీ నిర్మాణాలు చేపట్టాలి. హైదరాబాద్ హైటెక్ సిటి గురించి ఆవకాశం వచ్చినపుడల్లా చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకు వెళ్లిందో మనం చేస్తున్నాం. ఇపుడాయన మరొక ఉదాహరణ సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ఏవరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. భారీ నిర్మాణాలు ప్రణాళికలు ఆయనకు ఇంత వరకు అచ్చి రాలేదు. హైటెక్ సిటి 1998లో అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రారంభించారు. దాని ప్రచారం ఏమీ పనిచేయలేదు. 2004లో ఆయన ఓడిపోయారు. ఇలాగే 2014 నుంచి 2019 మధ్య ఆయన మాట్లాడిందంతా ఒక్కటే అమరావతి కలల నగరం. ఎన్ని నమూనాలు, ఎంత మంది నిర్మాతలు మారారో. చివరకు 2019 లో ఆయన డిజైన్లు ఏవీ టిడిపి సహకరించలేదు. ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 లో అధికారంలోకి వచ్చాక కూడా ఆయన కలల సౌధాలను వదల్లేదు. దీనిని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు గాని, నిర్మాణాలను మాత్రం ఒక దేశరాజధానికి ఉండాల్సినంత స్థాయిలో జరపబోతున్నారు.
నిజానికి 2014-2019లోనే మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కానీ 2019-2024లో వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిని నిలిపివేసింది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని అవసరమని ఆయన భావించారు. సచివాలయం ఈ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక చిహ్నంగా ఉంటుందని అనుకుంటున్నారు.
టవర్ల అంతస్తులు, ఎత్తు
హెచ్‌వోడీ టవర్ 45 అంతస్తులతో నిర్మిస్తారు. సచివాలయ టవర్లు (1, 2, 3, 4) ప్రతి టవర్ 40 అంతస్తులతో నిర్మిస్తారు.
టెండర్లు, టెక్నికల్ బిడ్స్
సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ బుధవారం (ఏప్రిల్ 16, 2025) టెండర్లను ఆహ్వానించింది. టెక్నికల్ బిడ్స్ ఓపెనింగ్ మే 1, 2025న జరుగుతుంది. కాంట్రాక్ట్ సంస్థలు మే 1, 2025 వరకు బిడ్స్ దాఖలు చేయవచ్చు.
సచివాలయం పేరు
సచివాలయాన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) పేరుతో పిలుస్తారు.
సచివాలయ నిర్మాణంలో ప్రత్యేకతలు
డయాగ్రిడ్ స్ట్రక్చర్ : టవర్లు డయాగ్రిడ్ స్ట్రక్చర్‌తో నిర్మితమవుతాయి. ఇది ఆధునిక నిర్మాణ శైలిలో బలం, సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ స్ట్రక్చర్ భూకంప నిరోధకత, శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
స్థిరమైన డిజైన్: సచివాలయం గ్రీన్ బిల్డింగ్ సూత్రాలను అనుసరిస్తుంది. ఇందులో సౌర శక్తి వినియోగం, నీటి పునర్వినియోగ శక్తి సామర్థ్యం ఉంటాయి.
సాంస్కృతిక అంశాలు: ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి స్థానిక వారసత్వాన్ని హైలైట్ చేస్తాయి.
టవర్ల ఆధునిక ఆర్కిటెక్చర్, డయాగ్రిడ్ ఫసాడ్‌తో కూడిన సొగసైన రూపం చూపరులను ఆకర్షిస్తుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా మారనుంది. ఇది రాష్ట్ర రాజధాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. రాత్రి సమయంలో లైటింగ్ డిజైన్, చుట్టూ ఉన్న ల్యాండ్‌స్కేపింగ్ భవనాల సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
నిర్మాణంలో టెక్నాలజీ
స్మార్ట్ బిల్డింగ్ టెక్నాలజీ: సచివాలయంలో ఆటోమేటెడ్ సిస్టమ్స్, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్, అధునాతన సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి.
గ్రీన్ టెక్నాలజీ: సౌర ప్యానెల్స్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, శక్తి సామర్థ్య ఉపకరణాలు ఉపయోగిస్తారు.
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: హై-స్పీడ్ ఇంటర్నెట్, క్లౌడ్-బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్, డిజిటల్ గవర్నెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
ఆర్కిటెక్చర్ డిజైన్
సచివాలయం ఆర్కిటెక్చర్ డిజైన్‌ను ‘నార్మన్ పోస్టర్’ (ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్) నేతృత్వంలోని ‘ఫోస్టర్ + పార్టనర్స్’ సంస్థ అందించింది. ఈ డిజైన్ ఆధునికతతో పాటు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. అమరావతిని ఒక విశ్వ నగరంగా చూపించడానికి చేసే ప్రయత్నం ఇది.
నిర్మాణ గడువు
సచివాలయ టవర్ల నిర్మాణం ‘రెండున్నర సంవత్సరాలలో’ (సుమారు 2027 నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నిధుల వనరులు
నిర్మాణానికి నిధులు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB), హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంక్ నుంచి రూ.31,000 కోట్ల రుణాల రూపంలో సమకూరుతున్నాయి. మొదటి విడతగా ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.480 కోట్లు మంజూరయ్యాయి.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఐదు టవర్లతో (45, 40 అంతస్తులు) డయాగ్రిడ్ స్ట్రక్చర్‌తో నిర్మితమవుతోంది. ఇందులో సీఎం కార్యాలయ టవర్ ఖర్చు రూ.1,126 కోట్లు. ఆధునిక టెక్నాలజీ, గ్రీన్ బిల్డింగ్ సూత్రాలు, సాంస్కృతిక అంశాలతో ఈ భవనాలు చూపరులను ఆకర్షిస్తాయి. ఫోస్టర్ + పార్టనర్స్ డిజైన్ చేసిన ఈ సచివాలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వకారణంగా నిలుస్తుంది.
సచివాలయ మోడల్, టెక్నాలజీ ఎక్కడ వాడారు?
అమరావతి సచివాలయం ఐదు టవర్లు (ఒకటి 45 అంతస్తులు, నాలుగు 40 అంతస్తులు) డయాగ్రిడ్ స్ట్రక్చర్‌తో నిర్మితమవుతున్నాయి. డయాగ్రిడ్ అనేది వికర్ణంగా ఇనుము, కాంక్రీట్ బీమ్‌లతో కూడిన ఫ్రేమ్‌వర్క్. ఇది తక్కువ స్టీల్‌తో ఎక్కువ బలాన్ని, సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పలు ఐకానిక్ భవనాల్లో ఉపయోగించారు.
హర్స్ట్ టవర్ (Hearst Tower), న్యూయార్క్ సిటీ (డిజైన్: నార్మన్ ఫోస్టర్): ఈ భవనం డయాగ్రిడ్ స్ట్రక్చర్‌తో నిర్మితమై, శక్తి సామర్థ్యం, సౌందర్యం బాగుందని ప్రశంసలు అందుకుంది.
గ్వాంగ్జౌ టవర్ (Guangzhou) చైనా: డయాగ్రిడ్ డిజైన్‌తో నిర్మితమై, ఆధునిక ఆర్కిటెక్చర్‌లో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.
30 సెయింట్ మేరీ ఆక్స్ ( 30 St Mary Axe, The Gherkin), లండన్: నార్మన్ ఫోస్టర్ డిజైన్ చేసిన ఈ భవనం డయాగ్రిడ్-ప్రేరిత స్ట్రక్చర్‌తో స్థిరత్వం, ఆకర్షణీయ రూపంతో నిర్మితమైంది.
ప్రజాదరణ: ఈ డిజైన్‌లు ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, సాధారణ ప్రజల నుండి సౌందర్యం, స్థిరత్వం, మరియు శక్తి సామర్థ్యం కారణంగా విస్తృత ప్రశంసలు అందుకున్నాయి. ఉదాహరణకు, హర్స్ట్ టవర్ LEED గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఇది గ్రీన్ బిల్డింగ్ రంగంలో ఒక గొప్ప గుర్తింపు.
భారతదేశంలో మొదటి సారిగా డయాగ్రిడ్ స్ట్రక్చర్
భారతదేశంలో డయాగ్రిడ్ స్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఇంకా విస్తృతంగా ఉపయోగించలేదు. కానీ కొన్ని ఆధునిక భవనాలు (ఉదా. ముంబైలోని కొన్ని కమర్షియల్ బిల్డింగ్‌లు) ఈ టెక్నాలజీని పాక్షికంగా అవలంబించాయి. అయితే అమరావతి సచివాలయం ఈ స్థాయిలో డయాగ్రిడ్‌ను ఉపయోగించడం భారతదేశంలో మొదటిదిగా చెప్పవచ్చు.
ఢిల్లీలోని పార్లమెంట్ భవనం లేదా తెలంగాణ రాష్ట్ర సచివాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్) వంటి భవనాలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అయినా అమరావతి సచివాలయం డయాగ్రిడ్ స్ట్రక్చర్, స్కేల్ (ఐదు టవర్లు), గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ (ఫోస్టర్ + పార్టనర్స్) డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.
నార్మన్ ఫోస్టర్ రూపొందించిన డిజైన్ ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్‌కు ఉదాహరణ. ఫోస్టర్ + పార్టనర్స్ లండన్‌లోని ఘెర్కిన్, బీజింగ్‌లోని క్యాపిటల్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్ట్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఈ భవనం ప్రపంచ దేశాలను ఆకర్షించాలంటే, నిర్మాణ నాణ్యత, సమయం ప్రకారం పూర్తి చేయడం, ప్రచారం (మార్కెటింగ్) కీలకం. గతంలో అమరావతి ప్రాజెక్ట్‌లో జాప్యం, రాజకీయ అడ్డంకులు (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో) సవాళ్లుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA): CRDA అధికారులు డిజైన్ అమలు, టెండర్ ప్రక్రియ, నిర్మాణ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. IIT మద్రాస్ నిపుణులు స్ట్రక్చరల్ స్టెబిలిటీని ధృవీకరించారు. ఫౌండేషన్, స్ట్రక్చరల్ బలాన్ని ధృవీకరించడంలో సాంకేతిక సహకారం అందించారు.
సాంస్కృతిక, ఆర్ట్ ఎలిమెంట్స్: ఫోస్టర్ + పార్టనర్స్ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే డిజైన్ ఎలిమెంట్స్‌ను చేర్చారు. ఉదాహరణకు స్థానిక కళలు, చిహ్నాలు, జియోమెట్రిక్ ప్యాటర్న్‌లు ఫసాడ్, ఇంటీరియర్‌లో ఉంటాయి.